కొత్త వారొస్తే సమాచారమివ్వండి

 

Police

  • ఇల్లెందు డిఎస్పీ చంద్రభాను
  • బూస్రాయిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు

గ్రామంలోకి ఎవరైనా కొత్త వారొస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇల్లెందు డిఎస్పీ చంద్రభాను కోరారు. సోమవారం ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొత్తి కోయ గ్రామమైన బూస్రాయిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.  అంతకు ముందు ఆయన గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రభాను గ్రామస్తులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ తరపున సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లో నివసించే ఆదీవాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలను అందించడంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎల్ల వేళలా ముందుంటారని, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామంలోని యువత మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్, ఎస్సై సోమేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు