భూ నిర్వాసితులకు మెరుగైన నష్ట పరిహారం
- భూ సేకరణకు సహకరించండి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ పరిధిలో
మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్
ఖాన్ చెప్పారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరారు. సోమవారం ఖమ్మం ఆర్డీవో
కార్యాలయం లోని నేషనల్ హైవే ప్రాజెక్ట్ భూ సేకరణ బాధితులతో ఆయన సమన్వయ సమావేశం
నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చింతకాని మండలంలోని కోదుమూరు, వందనం గ్రామాల్లో
భూసేకరణ జరిగే భూ యజమానులు, రైతులతో నష్టపరిహారంపై చర్చించారు. అయితే, రైతులు తమ సమస్యలను దృష్టికి
తీసుకొచ్చారు. ఇప్పటికే జాతీయ రహదారి సూర్యాపేట దేవరపల్లి రోడ్డు వల్ల పొలాలు నష్ట
పోయామని,
అదే
విధంగా గ్రామాల నుండి అమరావతి నాగపూర్ రోడ్డు రావడం వల్ల గ్రామంలో చిన్న సన్న కారు
రైతులు భూములు పూర్తిగా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలో ఉన్న పైపులు, కట్టడాలు, ఇప్పుడు ఉన్న పంటలు, సుబాబులు, జామాయిలు చెట్లలను
నష్ట పోవాల్సి వస్తుందన్నారు. సర్వే చేసి అవార్డు కాపీ పాస్ చేసిన తర్వాతే, తాము కూడా సహకరిస్తామని రైతులు అన్నారు. రైతుల సమస్యలు
విన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భూ సేకరణకు అవార్డ్ పాస్ చేశామని, ప్రభుత్వ పరిధిలో ఉన్న
మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి
విక్రమార్క ప్రత్యేక చొరవతో గ్రామాలకు ప్రత్యేక సర్వీస్ రోడ్ ముంజూరు చేసేందుకు చర్యలు
తీసుకున్నారని తెలిపారు. హైవేతో పాటు మిగులు భూములకు సర్వీస్ రోడ్ వల్ల మంచి
డిమాండ్ పెరుగుతుందని, స్ధానిక ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, చింతకాని మండల తహసీల్దార్ అనంత రాజు, నేషనల్ హైవే అధికారులు
పాల్గొన్నారు.
Comments
Post a Comment