ఇక్కడ ఎంత మంది మంత్రులున్నా ... రేణుక కూడా వుంటుంది

నేను ఈ జిల్లా ఆడ బిడ్డను ... వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు మావోయిస్టులతో కేంద్రం చర్చలెందుకు జరపడం లేదు ? కేంద్రం కుట్రతో బనకచర్ల నిర్మాణానికి సన్నాహాలు బీఆర్ఎస్ , బీజేపీల మధ్య రహస్య బంధం కొనసాగుతోంది కవిత పర్యటనలకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి ? కేంద్ర మాజీ మంత్రి , రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఎంత మంది మంత్రులు ఉన్నా ... రేణుక కూడా ఖమ్మంలోనే ఉంటుందని మాజీ కేద్ర మంత్రి , రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఈ జిల్లా ఆడ బిడ్డను , జిల్లాను వదిలి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. జిల్లాలో తన సత్తా అంటే ఏంటో చూపిస్తానని ఉద్ఘాటించారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె , స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీజ్ ఫైర్తో పాక్ , మిజోరాంతో చర్చలు జరిపిన కేంద్రం , మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. పక్కదేశాలైన నేపాల్ , చైనాలతో ప్రమాదం పొంచి ఉందని , దానిని కేంద్రం నివారించడం లేదన్నారు. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించమంటే , నిర్వహించడం లేదని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కాం...