మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

 

Khammam Collector Anudeep Durishetti

  • భూ నిర్వాసితులతో చర్చలు జరపాలి
  • ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • క్షేత్ర స్థాయిలో వాల్ నిర్మాణ పనుల పరిశీలన 

ఖమ్మం వద్ద మున్నేరు నదికి ఇరు వైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికార్లను ఆదేశించారు. మంగళవారం ఆయన అధనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి వద్ద రిటైనింగ్ వాల్, డ్రెయిన్, రోడ్డు నిర్మాణాలు, పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికార్లను అడిగి తెలుసుకున్నారు. ఎర్త్ వర్క్ 41 శాతానికి పైగా, సిమెంట్ కాంక్రీట్ పనులు 32 శాతం మేర పూర్తయినట్లు అధికార్లు తెలిపారు. నగరం నుండి వివిధ డ్రెయిన్ల నుండి వచ్చే వరద నీటి నిర్వహణను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  మాట్లాడుతూ  మున్నేరు నదికి ఇరు వైపులా ఎనిమిదిన్నర కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, దీని కోసం 138 ఎకరాల పట్టా భూమి సేకరించాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రభుత్వ భూమి, అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబధించిన 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాల అభివృద్ధి చేసి, భూ నిర్వాసితులకు పరిహారంగా అందించాలని, అందుకు వారిని ఒప్పించాలని కలెక్టర్ సూచించారు. పరిహారంగా ఇవ్వనున్న భూమిని చదును చేసి, ప్లాట్లుగా విభజించి, రోడ్లు, ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. భూ విలువ పై కూడా భూ నిర్వాసితులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటి వరకు 70 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టాదారులు ఒప్పుకున్నట్లు తెలిపారు. మిగతా వారితో చర్చలు జరిపి ఒప్పించాలన్నారు. మున్నేరు వరదలతో నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. మున్నేరు వరదలకు పై నుండి వచ్చే ఆకేరు తదితర నీటి మట్టాలను, ప్రవాహ ఉదృతులను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో జలాశయాలు, నదుల నీటి మట్టాలపై ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని, ప్రమాద స్థాయినిపై ముందస్తుగా సమాచారం ఇస్తే, ప్రభావిత ప్రాంతాల ప్రజల తరలింపు ప్రక్రియతో నష్టం జరగకుండా చూడొచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఇర్రిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఇఇ అనన్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం అర్బన్, రూరల్ మండల తహశీల్దార్లు సైదులు, రాంప్రసాద్, ఇర్రిగేషన్ డిఇ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Khammmam Munneru


Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే