వచ్చిన వాకిటి ... వెళ్ళారెందుకు ?
- ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి పర్యటనపై చర్చ
- భట్టి పర్యటన, సమీక్షా సమావేశంలో పాల్గొన కుండానే వెళ్లడంపై ఊహాగానాలు
- ముగ్గురు మంత్రులతో కలిసి మరో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామన్న వాకిటి
- డిప్యూటీ సీఎం భట్టిని కలవడానికి మాత్రమే ఖమ్మం వచ్చానని క్లారిటీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఖమ్మం పర్యటనపై చర్చ జరుగుతోంది.
బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన జిల్లా అధికార్లు, ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరు
కాకుండానే, డిప్యూటీ
సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వెళ్ళి పోయారు. పోతూ పోతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా తనను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు
తెలిపానని, డిప్యూటీ
సీఎం భట్టి ఖమ్మం పర్యటనలో ఉన్నారని
తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి మర్యాద పూర్వకంగా
కలిశానని చెప్పారు. త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులను సంప్రదించిన
తర్వాత,
ఉమ్మడి ఖమ్మం
జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అయితే, ఖమ్మం వరకూ వచ్చిన మంత్రి వాకిటి
శ్రీహరి,
డిప్యూటీ
సీఎం భట్టి, మరో
మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి జిల్లా అధికార్లు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనక
పోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఫోటోగ్రఫీ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా పని
చేశారు. తాజాగా తెలంగాణ క్యాబినెట్లోకి ముగ్గురు మంత్రులను తీసుకోవడంతో అందులో
ఒకరైన రాష్ట్ర పశువర్ధ, మత్స్య, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరిని ఉమ్మడి ఖమ్మం
జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమించారు. దీంతో ఆయన బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల
సమావేశాన్ని ఖమ్మం కలెక్టరేట్లో ఏర్పాటు
చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మధిర పర్యటనకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
సమావేశానికి హాజరవుతారని అధికారిక టూర్ షెడ్యూల్ విడుదలైంది. అయితే, జిల్లాకు చెందిన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు హైదరాబాద్ లో వున్నారు. మరో మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జిల్లాలో లేరు. ఈ నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి
వాకాటి శ్రీహరి బుధవారం మొదటి సారి ఖమ్మం నగరానికి చేరుకున్నారు. మర్యాద పూర్వకంగా
డిప్యూటీ సీఎం భట్టిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన తన పర్యటనను అంత వరకే
పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన భట్టి పర్యటనలో గానీ, అధికారుల సమీక్ష సమావేశంలో గానీ
పాల్గొన కుండానే వెళ్ళి పోయారు. ఏం జరిగిందో తెలియదు గానీ అర్ధాంతరంగా మంత్రి వాకిటి
ఖమ్మం నుండి వెళ్ళి పోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన పర్యటనపై మీడియాకు క్లారిటీ
ఇచ్చినప్పటికీ ఏదో జరిగిందన్న అనుమానం కలుగుతోంది.
Comments
Post a Comment