మావోలు లొంగి పోవడమే మేలు

Mavoists

  • తెలంగాణలో మావోయిస్టులకు స్థానం లేదు
  • కాదని సంచరిస్తే పోలేసుల నుండి తప్పించుకో లేరు  
  • అగ్ర నేతలు లొంగి పోతే పునరావాసానికి ప్రత్యేక చర్యలు
  • భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ప్రకటన
  • ఎస్పీ ఎదుట లొంగి పోయిన 12 మంది మావోయిస్టులు

నిషేధిత మావోయిస్టులు చావో రేవని పోరాడడం కన్నా లొంగి పోవడం మేలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హితవు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు తక్షణమే లొంగి పోయి, జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో మావోయిస్టులకు తావు లేదని, ఎవరైనా ఈ ప్రాంతంలో సంచరిస్తే, పోలీసు బలగాల నుండి తప్పించుకొనే అవకాశమే లేదని హెచ్చరించారు. కర్రె గుట్టల్లో 31 మంది మావోలు ప్రాణాలు కోల్పోవడాన్ని మారువ కూడదన్నారు. గురువారం నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న 12 మంది కొత్తగూడెంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగి పోయారు. వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికీ రూ. 25, 000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ, చత్తీష్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం వుందని, ఎవరైనా కొత్త వారు గ్రామాల్లోకి వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇటీవల స్థానికులిచ్చిన సమాచారంతోనే, ములుగు జిల్లాలో 20 మంది సాయుధ దళ సభ్యులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇక్కడి చైతన్య వంతమైన ప్రజలున్నారని, ఆచరణ సాధ్యం కానీ సిద్ధాంతాలకు ఎప్పుడో కాలం చెల్లిందన్న సంగతిని మావోయిస్టులు గ్రహించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వెంటనే మావోయిస్టులు లొంగి పోయి, ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల అభివృద్ధికి దోహద పాడాలని విజ్ఞప్తి చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు లొంగి పోతే, వారి పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

SP Rohith Raju



Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు