ఏ ఎన్నిక వచ్చినా వీరిని దీవించండి
- గత ప్రభుత్వ మంచి పథకాలను కొనసాగిస్తున్నాం
- అప్పులు తీరుస్తూ కొత్త పథకాలు తీసుకు వచ్చాం
- పేదలకు అండగా వుండాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశ్యం
- తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం తరుపున నిలబడే అభ్యర్థులను
దీవించాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు.
శుక్రవారం ఆయన అశ్వారావుపేట నియోజక వర్గంలోని చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి, ములకల పల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సీసీ రోడ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన
చేశారు. ఆయా సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన
ఇందిరమ్మ ప్రభుత్వం, ఏడాదిన్నర
కాలంలో గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను అమలు చేస్తూనే, పేదవాడి కళ్లలో
ఆనందాన్ని చూడాలని అనేక అభివృద్ధి , సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రం
సుమారు రూ. 8.19 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ
ప్రభుత్వం ప్రతీ హామీని నెర వేర్చాన్న తపనతో
ముందుకు పోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు
విడతల్లో రూ.10 వేల రూపాయలు ఇస్తే, తాము రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.12 వేల రూపాయలు ఇస్తున్నామని
చెప్పారు. ప్రస్తుతం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని, తొమ్మిది రోజుల్లోనే
మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. అంతే కాకుండా, రైతన్నలకి నాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రూ.17వేల
కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ. 21 వేల
కోట్ల రుణ మాఫీ చేసిందన్నారు. అలాగే, పేదవాడు కలలు కన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను గత ప్రభుత్వం కలగానే
మిగిల్చితే, ఇందిరమ్మ
ప్రభుత్వం ఆ కలను నెరవేరుస్తూ వస్తుందన్నారు. తమ పాలనలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆడ బిడ్డలు ఎంత దూరం
ప్రయాణం చేసినా ఒక్క రూపాయి చార్జీ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం, 40 శాతం మెస్, 200 శాతం కాస్మొటిక్
ఛార్జీల పెంపు, రేషన్
షాపుల ద్వారా సన్న బియ్యం, క్వింటా సన్నాలకు రూ. 500 బోనస్, కొత్త రేషన్ కార్డులు
పంపిణీ వంటి అనేక పథకాలను చేపట్టామని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా పేదవాడికి అండగా ఉండాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం
ఈ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ పర్యటనలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ, భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment