ఇక్కడ ఎంత మంది మంత్రులున్నా ... రేణుక కూడా వుంటుంది

 

Renuka Chowdary

  • నేను ఈ జిల్లా ఆడ బిడ్డను ... వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు
  • మావోయిస్టులతో కేంద్రం చర్చలెందుకు జరపడం లేదు ?
  • కేంద్రం కుట్రతో బనకచర్ల నిర్మాణానికి సన్నాహాలు
  • బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య బంధం కొనసాగుతోంది
  • కవిత పర్యటనలకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి ?  
  • కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి

ఎంత మంది మంత్రులు ఉన్నా ... రేణుక కూడా ఖమ్మంలోనే ఉంటుందని మాజీ కేద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఈ జిల్లా ఆడ బిడ్డను, జిల్లాను వదిలి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. జిల్లాలో తన సత్తా అంటే ఏంటో చూపిస్తానని ఉద్ఘాటించారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె, స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీజ్ ఫైర్తో పాక్, మిజోరాంతో చర్చలు జరిపిన కేంద్రం, మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. పక్కదేశాలైన నేపాల్, చైనాలతో ప్రమాదం పొంచి ఉందని, దానిని కేంద్రం నివారించడం లేదన్నారు. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించమంటే, నిర్వహించడం లేదని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ఎండగడుతుందనే భయంతోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదని విమర్శించారు. అయితే, జూలై 21 నుండి సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్తుందని, ఈ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. కేంద్రం కుట్రతో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, తెలంగాణకు అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.  తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారని కొనియాడారు. ప్రజా పాలనను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని ద్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు కల్పిస్తున్న ఎస్కార్ట్ ను రద్దు చేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు తమ రహస్య బంధం కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. ఆమె వెనుకాల ఉన్నది ఎవరో తేలాలన్నారు. పసుపు బోర్డులాగా మిర్చి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రేణుకా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో  సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, నాయకులు మానుకొండ రాధా కిషోర్, మిక్కిలి నరేందర్, కార్పొరేటర్ రఫీదా ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.


MP Renuka Chowdary

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు