ఖమ్మంలో పారిశుధ్య నిర్వహణకు 100 రోజుల ప్రణాళిక
- పరిశుభ్రమైన నగరంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి
- తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం నగరంలో పారిశుద్య నిర్వహణకు 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు
చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. అందులో
భాగంగా వానలు రాక ముందే కార్పోరేషన్ అధికారుల ప్రత్యేక చొరవతో కాల్వలో మురుగు నీరు
నిల్వ ఉండకుండా, ఎక్కడా
చెత్త పేరుకు పోకుండా, దుర్గందం రాకుండా 20 రోజులుగా నగరంలో పారిశుధ్య
కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఖమ్మాన్ని పరిశుభ్రమైన నగరంగా తయారు
చేసేందుకు ప్రజలు సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన నగర మేయర్
పునుకొల్లు నీరజ, నగరపాలక
సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి వరదయ్య నగర్లో నిర్వహించిన ప్రత్యేక
పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి చెత్తను రోజూ సేకరిస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, డ్రైయిన్లలో చెత్త
వేయవద్దని కోరారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం, మన పిల్లలు ఆరోగ్యంగా వుంటారని
అన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి డివిజన్ లో ఉన్న
డ్రైయిన్లను శుభ్రం చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, పిచ్చి మొక్కల తొలగించడం వంటి
కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అంతకు ముందు మంత్రి తుమ్మల వరదయ్య నగర్లో
మొక్కను నాటారు. రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ
చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా
జోహ్ర,
పబ్లిక్
హెల్త్ ఇఇ వి. రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్
తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment