ఫేక్ కాల్స్ నమ్మి ఎవరు డబ్బులు చెల్లించ వద్దు

Khammam Municipal Corporation


  • ట్రెడ్ లైసెన్స్ కోసం ఫోన్ కాల్స్ చేయడం లేదు
  • ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా వుండాలి
  • ఖమ్మం కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ నుండి ట్రెడ్ లైసెన్స్ కు సంబంధించి ఎటువంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో వస్తున్న ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని పెద్ద పెద్ద భవనాలు, ఆసుపత్రులు, వాణిజ్య వ్యాపారవేత్తలకు 9346423925 నెంబర్ తో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుండి చేసినట్లుగా ఫేక్ ఫోన్ కాల్స్ చేసి, ట్రేడ్ లైసెన్స్ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులెవరూ ఎటువంటి ఫోన్ కాల్స్ ను పట్టించు కోవద్దని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఫోన్ కాల్స్ ద్వారా బిల్లుల సేకరణ జరగదన్నారు. ఫేక్ కాల్స్ నమ్మి ఎవరు డబ్బులు చెల్లించి మోస పోవద్దని, ఇటువంటి ఫోన్ కాల్స్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ అభిషేక్ అగస్త్య ఆ ప్రకటనలో హెచ్చరించారు.


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు