Posts

Showing posts from June, 2024

స్థలం ఓకే చేస్తే ... రెండు రోజుల్లోనే ఇళ్ళ స్థలాలు

Image
ఖమ్మం జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి తీపి కబురు హైదరాబాద్ బాద్ జర్నలిస్టులకు త్వరలో జీఓ ఇస్తామని వెల్లడి జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటన ఖమ్మం : ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం గతంలో ఇచ్చిన జీఓలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని ... ఆ స్థలానికి ప్రత్యామ్నాయంగా మరొక స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు సూచించారు. మరొక స్థలాన్ని ఎంపిక చేసుకొని ప్రతిపాదను పంపిస్తే ... రెండు రోజుల్లోనే ఇళ్ళ స్థలాల జీఓ ఇస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు ఖమ్మంలో జరగనున్న టీయూ డబ్లూజే( ఐజేయు ) రాష్ట్ర మహాసభల ప్రారంబ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సభలు ముగిసిన వెంటనే కలెక్టర్ను కలసి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ మేరకు సంభంధిత అధికార్లను ఆదేశించినట్లు చెప్పారు.  తానూ ఈ జిల్లా వాసిని కావడం వల్ల ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న స్వార్ధంకూడా తనకు ఉందని అన్నారు. అదే విధంగా హైదరాబాద్ జర్నలిస్టులకు యుద్ద ప్రాతిపదికన ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపరతామని చెప్పారు. న్యా...

కొత్త కలెక్టర్ మానవత్వం ...

Image
భద్రాద్రి కొత్తగూడెం : బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఒక రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటొ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ ... ఆటొలో ప్రయాణిస్తున్న నలుగురికీ గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ పాటిల్ తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మానవతా దృక్పదాన్ని పలువురు ప్రశంసించారు. Janechcha

ఖమ్మం కలెక్టర్ గా ముజామిల్ ఖాన్

Image
ఖమ్మం జిల్లా కలక్టర్ వీపీ గౌతమ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పెద్దపల్లి కలెక్టర్ గా ఉన్న ముజామిల్ ఖాన్ ను నియమించారు. ముజామిల్ ఖాన్ మాజీ పోలీస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు.    

యోనో లక్ష్యంగా సైబర్ మోసాలు

Image
👉 సైబర్ నేరగాళ్ల లింకులు , మెసేజ్ లకు స్పందించ వద్దు 👉 ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరిక ఖమ్మం: ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజీలలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాగాళ్లు డాటాలో ఉన్న ఫోన్‌ నంబర్ల అధారంగా మీ అకౌంట్ లో రివార్డ్ నగదు జామ ఆవుతుందని,   మీ కేవైసీ అప్‌డేట్‌ కాలేదని ... మీ ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అయిందని, అన్ బ్లాక్ కోసం పాన్ కార్డ్ నంబర్ లింకులో నమోదు చేస్తే అప్ డేట్ అవుతుందని మెసేజ్ పంపిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు.   మెసేజ్ లకు స్పందించి లింక్ ఓపెన్ చేసిన బాధితుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసున అనంతరం వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడంతో 60 శాతం అప్ డేట్ అయిందని తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేయగా 70 శాతం అని చూపిస్తుందని,ఆ తర్వాత మళ్ళీ ఓటిపి రావడంతో ఓటీపీ ఎంటర్ చేయడంతో 90 శాతం చూపి...

పల్లె వెలుగులో ... డిప్యూటీ సీఏం

Image
👉 ఆశ్చర్యానికి గురైన ప్రయాణికులు   అందరూ హడావిడిగా బస్సెక్కుతున్నారు ...  ఎక్కినవాళ్లు సీట్ల కోసం హైరానా పడుతున్నారు.  ఇంతలో అందర్నీ తోసుకుంటూ ఓ వ్యక్తి బస్లోకి వచ్చారు. సడన్గా చూసిన ప్రయాణీకులు ... ఒకింత ఆశ్చర్యానికి ... ఒకింత ఆనందానికీ గురైయ్యారు. సాక్షాత్తు తెలంగాణ ఉప ముఖ్యమంత్రే ఆర్డినరీ బస్లో కనబడే సరికీ ... నమ్మలేక పోయారు. డిప్యూటీ సీఏం మల్లు బట్టి విక్రమార్క ఈరోజు పల్లె వెలుగు బస్లో ప్రాయాణించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుండి బోనకల్ వెళ్ళే బస్సెక్కారు. ఎక్కీ ఎక్కగానే ... కండక్టర్కి డబ్బులిచ్చి టిక్కెట్ కొనుకున్నారు. ఆ తరువాత ప్రయాణీకులతో పాటు కూర్చొని ముచ్చటించారు. మహిళలు ఎన్నిసార్లు ఉచిత బస్ ప్రయాణం చేశారో అడిగి తెలుసుకున్నారు. ఉచిత విధ్యుత్ పైనా ఆరా తీశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

పది రోజుల్లో మళ్లీ వస్తా …

Image
👉 మున్నేరు ఆర్సీ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి 👉 పనుల్లో వేగం పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక ఖమ్మం: మున్నేరుకు ఇరు వైపుల నిర్మిస్తున్న ఆర్సీ వాల్ నిర్మాణ పనులు నత్త నడకన సాగటంపై రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు దానవాయి గూడెం వద్ద ఆర్సీ వాల్స్ నిర్మాణ పనులను పరిశీలించిన పొంగులేటి ... ఇప్పటికే నాలుగు నెల్లు ఆలస్యమైందని ... ప్రతిభా వంతులైన వర్కార్లను నియమించి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పది రోజుల్లో మళ్ళీ వస్తా ... పనుల్లో పురోగతి లేక పోతే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే పుల్ టైమ్ పని చేసైనా పనులను పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు.  మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి , ఆర్డీవో గణేష్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు , రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్లెం వెంకట్ రెడ్డి , నా...

గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి

Image
👉 అవసరమైన ప్రాంతాల్లో ఎగ్జిట్ , ఎంట్రీలు ఏర్పాటు చేయాలి 👉 ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఖమ్మం: రహదారుల పనుల్లో వేగం పెంచి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులతో ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ –365 బిజి) ,  ఖమ్మం – అశ్వారావుపేట రోడ్డు పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మధిర రోడ్డు , ధంసలాపురం బోనకల్‌ రోడ్డు , సత్తుపల్లి రోడ్డు వద్ద ఎగ్జిట్‌ ,  ఎంట్రీ పాయింట్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కి సూచించారు. అదే విధంగా కల్లూరు నుండి మధిర రోడ్డు దగ్గర ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అనుమతి ఇచ్చిందని , ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి వేంసూర్‌ రోడ్డు వద్ద కూడా ఎగ్జిట్‌ , ఎంట్రీ పాయింట్లుకు అనుమతివ్వాలని సూచించారు. ఈ సమస్యను సైతం త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నార...

పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ

Image
👉 పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల  ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ పూనకొల్లు నీరజ పాల్గొన్నారు.

గెలుపోటములు సహజం - నామ

Image
 👉  గెలిచినా ... ఓడినా ... ప్రజల మధ్యే ఉంటా 👉 కన్న తల్లి ఎంత ఇష్టమో నియోజకవర్గ ప్రజలంటే అంతే ఇష్టం 👉 మచ్చలేని వ్యక్తిత్వంతో సేవలందించా 👉 పార్టీ శ్రేణులందరికీ, ఓటర్లకు కృతజ్ఞతలు 👉 తొమిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశాం 👉 రఘురాంరెడ్డికి అభినందనలు తాను గెలిచినా ... ఓడినా నిత్యం నియోజక వర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో .. నా నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదు .. ఓడితే కుంగేది లేదని అన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రశ్నించే గొంతుకగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని వెల్లడించారు. ప్రజల కనీస సదుపాయాల కోసం కొట్లాడతాని చెప్పారు. ఎంపీగా ప్రజా సేవే లక్ష్యంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మచ్చ లేని వ్యక్తిత్వంతో ప్రజలకు సేవలు అందించానని గుర్తు చేశారు. తనకు అన్ని విధాలా అండగా ఉండి, ముందుకు నడిపించిన పార్టీ కార్యకర్తలు, న...

రికార్డ్ బద్దల్ ...

Image
👉 ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన రఘురాం రెడ్డి  👉 7 , 66 , 929   ఓట్లు ... 4 , 67 , 847   ఓట్ల మెజార్టీ ఖమ్మ పార్లమెంట్ చరిత్రలోనే ... కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించారు. 19 52 నుండి వున్న రికార్డులను బద్దలు కొట్టారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అందిన సమాచారం మేరకు 4 , 6 7,847  ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రఘురాం రెడ్డికి వచ్చిన మెజార్టీ ... ఇంత వరకూ ఖమ్మం పార్లమెంట్ చరిత్రలోనే ఏ పార్టీ అభ్యర్ధికి రాలేదు.  ఒక్క 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నామ నాగేశ్వర రావు అత్యధికంగా 1 , 68 , 062 ఓట్ల మెజార్టీ సాధించారు. అప్పుడు నామకు మొత్తం 5 , 67 , 459 ఓట్లు వస్తే ... సమీప కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి 3 , 99 , 397 ఓట్లు  వచ్చాయి. ఇప్పుడు రఘురాం రెడ్డి ...  నామకు వచ్చిన ఆ రికార్డును తిరగ రాసి 4 , 67 , 847  ఓట్ల మెజార్టీ సాధించారు. రఘురామి రెడ్డికి మొత్తం -7 , 66 , 929 ఓట్లు రాగా తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వర రావుకు 2 , 99 , 082 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధ...

రేపే ఓట్ల లెక్కింపు ...

Image
  ఏర్పాట్లు పూర్తి ... మే13న జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామం వద్ద గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఈ సందర్బంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక హాల్ ... ప్రతి హాలుకు 14 టేబుళ్లు ... ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గానికి మాత్రం 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఖమ్మంలోని కొత్త, పాత బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, వైరా, మధిర, సత్తుపల్లి బస్ స్టాండ్ల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు.  లెక్కింపు ఎలా జరుగుతుంది ...  👉 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగానే మొదట పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కిపు మొదలైన అర్ధ గంట తర్వాతే పోలైన ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్లు లేక పోతే ... వెంటనే ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. 👉 ఓట్ల లెక్కింపుకు ఫారం 17 సీతో పాటు...