గెలుపోటములు సహజం - నామ


 👉 గెలిచినా ... ఓడినా ... ప్రజల మధ్యే ఉంటా

👉 కన్న తల్లి ఎంత ఇష్టమో నియోజకవర్గ ప్రజలంటే అంతే ఇష్టం

👉 మచ్చలేని వ్యక్తిత్వంతో సేవలందించా

👉 పార్టీ శ్రేణులందరికీ, ఓటర్లకు కృతజ్ఞతలు

👉 తొమిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశాం

👉 రఘురాంరెడ్డికి అభినందనలు

తాను గెలిచినా ... ఓడినా నిత్యం నియోజక వర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో .. నా నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదు .. ఓడితే కుంగేది లేదని అన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రశ్నించే గొంతుకగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని వెల్లడించారు. ప్రజల కనీస సదుపాయాల కోసం కొట్లాడతాని చెప్పారు.

ఎంపీగా ప్రజా సేవే లక్ష్యంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మచ్చ లేని వ్యక్తిత్వంతో ప్రజలకు సేవలు అందించానని గుర్తు చేశారు. తనకు అన్ని విధాలా అండగా ఉండి, ముందుకు నడిపించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు , తనకు ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలువుతున్నట్లు నామ పేర్కొన్నారు.తన బలం .. బలగం ధైర్యం . .ప్రజలేనని, అదే లక్ష్యంతో ఇక ముందు కూడా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిస్కారం .. సంక్షేమం కోసం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలతోనే తన జీవితం అన్నారు . ఇక్కడే పుట్టాను ..ఇక్కడే పెరిగాను .. ఇక్కడే నా ప్రజల మధ్యనే ఉంటాను. .ఎల్లవేళల ప్రజల కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి .. ఏ సమస్య వచ్చినా తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పు కోవచ్చని నామ తెలిపారు . తన జీవితం ప్రజాసేవకే అంకిత మని ప్రజా సేవ లోనే ఉంటానని నామ మరోమారు స్పష్టం చేశారు .తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని, గడప గడపకు సంక్షేమ పథకాలు చేర్చామని, ప్రతి వ్యక్తి ఏదో రూపంలో లబ్ది పొందేలా ప్రజారంజక పాలన అందించ గలిగామని అన్నారు. గెలిచిన రఘురాంరెడ్డి కి అభినందనలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు