అటవీ భూముల ఆక్రమణ , అధికార్లు , సిబ్బందిపై దాడులు , వాటిపై తప్పుడు వార్తలను సహించేది లేదని , చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 16న అటవీ అధికారులు , సిబ్బందిపై దాడి జరిగితే , కొన్ని పత్రికల్లో గిరిజనులపై అటవీ అధికారులు దాడి చేసినట్లు ప్రచురించడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ వార్తలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దాడికి గురైన అధికారి డి. చక్రవర్తి గిరిజన కమ్యూనిటీకి చెందిన వారని వెల్లడించారు. ఘటనలో మహిళలు కొద్ది మంది మాత్రమే వున్నారని , గిరిజనేతరులే ఎక్కువ మంది వున్నారని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా దాడికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఆ రోజు అటవీ ఆక్రమణల నిరోధానికి తాళ్లగూడెం మహిళా ఫారెస్ట్ సెక్షన్ అధికారి డి. శిల్ప , బీఆర్. పురం ఫారెస్ట్ సెక్షన్ అధికారి డి. చక్రవర్తి చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లగా ఆక్రమణ దారులు కారం పొడి కళ్ళలో చల్లుతూ , రాళ్లు రువ్వుతూ , తిడుతూ అధికారులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో అటవీ అధికారులు , సిబ్బందిపై దాడి చేసిన16 ...
Comments
Post a Comment