యోనో లక్ష్యంగా సైబర్ మోసాలు


👉 సైబర్ నేరగాళ్ల లింకులు, మెసేజ్ లకు స్పందించ వద్దు

👉 ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరిక

ఖమ్మం: ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజీలలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాగాళ్లు డాటాలో ఉన్న ఫోన్‌ నంబర్ల అధారంగా మీ అకౌంట్ లో రివార్డ్ నగదు జామ ఆవుతుందని,   మీ కేవైసీ అప్‌డేట్‌ కాలేదని ... మీ ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అయిందని, అన్ బ్లాక్ కోసం పాన్ కార్డ్ నంబర్ లింకులో నమోదు చేస్తే అప్ డేట్ అవుతుందని మెసేజ్ పంపిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు.  

మెసేజ్ లకు స్పందించి లింక్ ఓపెన్ చేసిన బాధితుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసున అనంతరం వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడంతో 60 శాతం అప్ డేట్ అయిందని తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేయగా 70 శాతం అని చూపిస్తుందని,ఆ తర్వాత మళ్ళీ ఓటిపి రావడంతో ఓటీపీ ఎంటర్ చేయడంతో 90 శాతం చూపించి కొద్దిసేపటి తర్వాత 100 శాతం అప్ డేట్ అయినట్టుగా చూపిస్తుందని తెలిపారు. 100 శాతం అప్ డేట్ చూపగానే విడతల వారీగా బాధితుని అకౌంట్ నుంచి నగదు కట్ అయినట్టుగా మెసేజ్ వస్తుందని తెలిపారు. దింతో డబ్బులు పోయినట్లు తేరుకుంటున్న బాధితులు తాము మోసపోయామని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. 

సైబర్‌నేరగాళ్లు ఎదో ఆశ చూపి వల వేస్తుంటారని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్‌లో మాట్లాడి.. ఏదైనా స్కీమ్‌ గురించి చెబితే  అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్‌క్రైమ్‌ టోల్‌ప్రీ నంబర్‌ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే నగదును రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు