స్థలం ఓకే చేస్తే ... రెండు రోజుల్లోనే ఇళ్ళ స్థలాలు


  • ఖమ్మం జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి తీపి కబురు
  • హైదరాబాద్ బాద్ జర్నలిస్టులకు త్వరలో జీఓ ఇస్తామని వెల్లడి
  • జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటన

ఖమ్మం : ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం గతంలో ఇచ్చిన జీఓలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని ... ఆ స్థలానికి ప్రత్యామ్నాయంగా మరొక స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు సూచించారు. మరొక స్థలాన్ని ఎంపిక చేసుకొని ప్రతిపాదను పంపిస్తే ... రెండు రోజుల్లోనే ఇళ్ళ స్థలాల జీఓ ఇస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు ఖమ్మంలో జరగనున్న టీయూ డబ్లూజే( ఐజేయు) రాష్ట్ర మహాసభల ప్రారంబ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సభలు ముగిసిన వెంటనే కలెక్టర్ను కలసి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ మేరకు సంభంధిత అధికార్లను ఆదేశించినట్లు చెప్పారు.  తానూ ఈ జిల్లా వాసిని కావడం వల్ల ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న స్వార్ధంకూడా తనకు ఉందని అన్నారు. అదే విధంగా హైదరాబాద్ జర్నలిస్టులకు యుద్ద ప్రాతిపదికన ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపరతామని చెప్పారు. న్యాయ పరమైన ఇబ్బందులను అధిగమించి త్వరలోనే ... సంబంధిత జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు, బస్ పాసుల గడువు ఈ నెలాకరకు ముగుస్తున్నందున ... వాటి గడువును  మరో మూడు నెల్లుపెంచినట్లు పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మూడు రోజుల క్రితమే ఇచ్చామన్నారు.  జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు కూడా తమ ప్రభుత్వం వెనకాడదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో ... కాబినెట్ సమావేశంలో చర్చించి కార్డులు అందజేస్తామన్నారు. 

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు