పల్లె వెలుగులో ... డిప్యూటీ సీఏం
👉 ఆశ్చర్యానికి గురైన ప్రయాణికులు
అందరూ హడావిడిగా బస్సెక్కుతున్నారు ... ఎక్కినవాళ్లు సీట్ల కోసం హైరానా పడుతున్నారు. ఇంతలో అందర్నీ తోసుకుంటూ ఓ వ్యక్తి బస్లోకి వచ్చారు. సడన్గా చూసిన ప్రయాణీకులు ... ఒకింత ఆశ్చర్యానికి ... ఒకింత ఆనందానికీ గురైయ్యారు. సాక్షాత్తు తెలంగాణ ఉప ముఖ్యమంత్రే ఆర్డినరీ బస్లో కనబడే సరికీ ... నమ్మలేక పోయారు. డిప్యూటీ సీఏం మల్లు బట్టి విక్రమార్క ఈరోజు పల్లె వెలుగు బస్లో ప్రాయాణించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుండి బోనకల్ వెళ్ళే బస్సెక్కారు. ఎక్కీ ఎక్కగానే ... కండక్టర్కి డబ్బులిచ్చి టిక్కెట్ కొనుకున్నారు. ఆ తరువాత ప్రయాణీకులతో పాటు కూర్చొని ముచ్చటించారు. మహిళలు ఎన్నిసార్లు ఉచిత బస్ ప్రయాణం చేశారో అడిగి తెలుసుకున్నారు. ఉచిత విధ్యుత్ పైనా ఆరా తీశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment