పది రోజుల్లో మళ్లీ వస్తా …
👉 మున్నేరు ఆర్సీ వాల్ పనులను పరిశీలించిన
మంత్రి పొంగులేటి
👉 పనుల్లో వేగం పెంచకపోతే చర్యలు తప్పవని
హెచ్చరిక
ఖమ్మం: మున్నేరుకు ఇరు వైపుల నిర్మిస్తున్న ఆర్సీ వాల్ నిర్మాణ పనులు నత్త నడకన
సాగటంపై రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
చేశారు. పనుల్లో వేగం పెంచి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు దానవాయి గూడెం వద్ద ఆర్సీ వాల్స్ నిర్మాణ పనులను పరిశీలించిన పొంగులేటి
... ఇప్పటికే నాలుగు నెల్లు ఆలస్యమైందని ... ప్రతిభా వంతులైన వర్కార్లను నియమించి పనులను
త్వరగా పూర్తి చేయాలన్నారు. పది రోజుల్లో మళ్ళీ వస్తా ... పనుల్లో పురోగతి లేక పోతే
సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే పుల్ టైమ్ పని చేసైనా పనులను పూర్తి చేయాలన్నారు.
రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభత్వ భూములను గుర్తించి ఇరిగేషన్
అధికారులకు అప్పగించాలన్నారు. మంత్రి పొంగులేటి
వెంట ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో గణేష్ , రాష్ట్ర గిడ్డంగుల
సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్లెం వెంకట్
రెడ్డి,
నాయకులు రామ్మూర్తి నాయక్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment