రికార్డ్ బద్దల్ ...


👉 ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన రఘురాం రెడ్డి 

👉 7,66,929  ఓట్లు ... 4,67,847  ఓట్ల మెజార్టీ

ఖమ్మ పార్లమెంట్ చరిత్రలోనే ... కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించారు. 1952 నుండి వున్న రికార్డులను బద్దలు కొట్టారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అందిన సమాచారం మేరకు 4,67,847  ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రఘురాం రెడ్డికి వచ్చిన మెజార్టీ ... ఇంత వరకూ ఖమ్మం పార్లమెంట్ చరిత్రలోనే ఏ పార్టీ అభ్యర్ధికి రాలేదు.  ఒక్క 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నామ నాగేశ్వర రావు అత్యధికంగా 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. అప్పుడు నామకు మొత్తం 5,67,459 ఓట్లు వస్తే ... సమీప కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు  వచ్చాయి. ఇప్పుడు రఘురాం రెడ్డి ...  నామకు వచ్చిన ఆ రికార్డును తిరగ రాసి 4,67,847  ఓట్ల మెజార్టీ సాధించారు. రఘురామి రెడ్డికి మొత్తం -7,66,929 ఓట్లు రాగా తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వర రావుకు 2,99,082 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుకు 1,18,636  ఓట్లు పోలయ్యాయి. అనుకున్నట్లు గానే బీజేపీ ఈ ఎన్నికల్లో పుంజుకుంది.  ఈ నియోజక వర్గంలో 1998లో మాత్రమే  బీజేపీ అభ్యర్ధి ధారావత్ రవీంద్ర నాయక్ కు అత్యధికంగా1, 17, 926 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వినోద్ రావు వాటికి మించి ఓట్లు సాధించారు. 


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు