రేపే ఓట్ల లెక్కింపు ...


 ఏర్పాట్లు పూర్తి ...

మే13న జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామం వద్ద గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఈ సందర్బంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక హాల్ ... ప్రతి హాలుకు 14 టేబుళ్లు ... ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గానికి మాత్రం 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఖమ్మంలోని కొత్త, పాత బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, వైరా, మధిర, సత్తుపల్లి బస్ స్టాండ్ల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. 

లెక్కింపు ఎలా జరుగుతుంది ... 

👉 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగానే మొదట పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కిపు మొదలైన అర్ధ గంట తర్వాతే పోలైన ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్లు లేక పోతే ... వెంటనే ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు.

👉 ఓట్ల లెక్కింపుకు ఫారం 17 సీతో పాటు కంట్రోల్ యూనిట్ అవసరముంటుంది. పోలైన ఓట్లను ఫారం సీలో పేర్కొన్న ఓట్లతో పోలుస్తారు. ఫారం సీ లోని ఓట్లు, ఈవీఎంలోని ఓట్లు సరిపోవాలి. 

👉 లెక్కింపు తర్వాత ఫలితాన్ని మొదట కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి. వచ్చిన ఫలితాన్ని 17 ఫారం సీ లోని పార్ట్ 2లో నమోదు చేయాలి. 

👉 పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ర్యాండంగా 5 ఈవీఎంలను ఎంపిక చేసుకొని వీవీ ప్యాట్లోని స్లిప్పులను లెక్కించాలి. 

👉 ఒక వేళ ఎన్నికల ఫలితంలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వస్తే .. డ్రా ద్వారా విజేతను ప్రకటించాలి.


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు