గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి

👉 అవసరమైన ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు ఏర్పాటు చేయాలి

👉 ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం: రహదారుల పనుల్లో వేగం పెంచి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులతో ఖమ్మందేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–365బిజి),  ఖమ్మంఅశ్వారావుపేట రోడ్డు పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మధిర రోడ్డు, ధంసలాపురం బోనకల్‌ రోడ్డు, సత్తుపల్లి రోడ్డు వద్ద ఎగ్జిట్‌,  ఎంట్రీ పాయింట్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కి సూచించారు. అదే విధంగా కల్లూరు నుండి మధిర రోడ్డు దగ్గర ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అనుమతి ఇచ్చిందని, ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి వేంసూర్‌ రోడ్డు వద్ద కూడా ఎగ్జిట్‌, ఎంట్రీ పాయింట్లుకు అనుమతివ్వాలని సూచించారు. ఈ సమస్యను సైతం త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించేందుకు ధంసలాపురం బోనకల్‌ రోడ్డు దగ్గర ఎగ్జిట్‌, ఎంట్రీ పాయింట్లు,  సర్వీస్‌ రోడ్లు గురించి అధికారులకు పలు రకాల సూచనలు చేశారు. వీటన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సైట్‌ పరిస్థితుల ప్రకారం సర్వే చేసి సాంకేతిక నివేదిక అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఖమ్మంఅశ్వరావుపేట రోడ్డు ఎన్‌హెచ్‌–365బిబి ఏర్పడిన గుంటలను తక్షణమే పూడ్చి ఆ సమస్యలనూ పరిష్కరించాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే సమస్యలు పరిష్కారానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి నాణ్యత ప్రమాణాలతో  పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు