స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వం
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు ఈ నెల 19న లగచర్లకు పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం బసుల తగ్గింపుకుపై 4న డిపోల ఎదుట ఆందోళనలు కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు వుండబోదని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ , స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి గానే పోటీ చేస్తామన్నారు. ఒక వేళ వామ పక్ష పార్టీలు ముందుకు వస్తే కలసి పోటీ చేస్తామని చెప్పారు. మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నవంబర్ 14 , 15 , 16 తేదీలలో ఖమ్మంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పోటు రంగారావు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఫార్మ కంపెనీల ప్రయోజనాలకు అనుకుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే వికారాబాద్ జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు , అక్రమ అరెస్టులు ఆపాలని , రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రంగారావు డిమాండ్ చేశారు. రైతులు తమ భూముల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ బలపరుస్...