Posts

Showing posts from July, 2026

జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్, సెస్సులు తొలగించండి

Image
వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా నేతల డిమాండ్ టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేత ఖమ్మం: వర్కింగ్ జర్నలిస్టుల స్టేట్ కన్సెషన్ పాసులపై టీజీఎస్ ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్న టోల్ టాక్స్ , సెస్సులను వెంటనే తొలగించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) డిమాండ్ చేసింది. నిబంధనల మేరకు బేసిక్ చార్జీల్లో 1/3 (సుమారు 33.3%) మాత్రమే వసూలు చేయాల్సి వుండగా , టోల్ టాక్స్ , సెస్సులు కలిపి 50 నుండి 60 శాతం వరకూ ఛార్జీలు వసూలు చేయడం సరైంది కాదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ , కోకన్వీనర్లు యెన్నెబోయిన శ్రీనివాస రావు , నాగరాజు దేవర , ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ , ప్రెస్ క్లబ్ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి , జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబ రావు , గోగుల నారాయణ రావు , కె. ప్రసాద రావు , ఏనిగండ్ల శ్రీనివాస రావు , బొడ్డుపల్లి రవీందర్ , సీనియర్ జర్నలిస్ట్ ఆరిక కిరణ్ కుమార్ తదితరులు తెలంగాణ ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ ఏ. సరి రామ్ కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల స్టేట్ కన్సెషన్ పాసులపై అదనంగా విధిస్తున్న టోల్ ట...