స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వం
- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు
- ఈ నెల 19న లగచర్లకు పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం
- బసుల తగ్గింపుకుపై 4న డిపోల ఎదుట ఆందోళనలు
- కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు వుండబోదని
సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. గత
అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ, స్థానిక సంస్థల
ఎన్నికల్లో ఒంటరి గానే పోటీ చేస్తామన్నారు. ఒక వేళ వామ పక్ష పార్టీలు ముందుకు
వస్తే కలసి పోటీ చేస్తామని చెప్పారు. మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నవంబర్ 14,15,16 తేదీలలో ఖమ్మంలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా పోటు రంగారావు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఫార్మ కంపెనీల ప్రయోజనాలకు
అనుకుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే వికారాబాద్
జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులు ఆపాలని, రైతులపై పెట్టిన
కేసులను ఎత్తివేయాలని రంగారావు డిమాండ్ చేశారు.
రైతులు తమ భూముల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్
బలపరుస్తుందని చెప్పారు. భూములు కోల్పోతున్న రైతుల అభీష్టం మేరకు ప్రభుత్వం
నిర్ణయం తీసుకోవాలి తప్ప, బలవంతంగా భూములు తీసుకోవడం సరైంది కాదన్నారు. సమస్యను
అధ్యయనం చేయడానికి తమ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ నెల19న లగచర్లను
సందర్శిస్తుందని తెలిపారు. రాష్ట్ర
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి, 3000 వేల బస్సులను తగ్గించడం
వల్ల ప్రయాణికులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బసులు సరిగా ఆపక, లోపల జాగలేక ఎన్నో
యిబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీనిపై డిసెంబర్ 4న బసు డిపోల ముందు, హైదరాబాద్ లోని బస్
భవన్ ముందు ధర్నాలు చేయనున్నట్లు రంగారావు తెలిపారు. పత్తి రైతుల పంటను
తేమతో సంబంధం లేకుండా సీసీఐ అన్ని సెంటర్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సీసీఐ ఖరీదు దార్లతో కుమ్మక్కయి రైతుల పంటలను నిరాకరిస్తుందని, వ్యాపారస్థుల పంటలను
మాత్రం పెద్దఎత్తున కొనుగోలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతుల
పంటను కొనుగోలు చేయాలని, అలానే దాన్యం కొనుగోళ్లు కూడా వెంటనే ప్రారంభించాలని, అన్ని రకాల దాన్యానికి
ప్రభుత్వం బోనస్ యివ్వాలని కోరారు. సీపీఐ(ఎం-ఎల్) మాన్లైన్, అఖిలభారత ప్రగతిశీల
రైతు సంఘం ప్రతినిధి బృందాలు మార్కెట్లను సందర్శించి అక్కడి సమస్యలపై ఆందోళనలు
నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకే రుణ మాఫీ
జరిగిందని,
మరో 22 లక్షల మందికి రుణ మాఫీ జరగాల్సి వుందన్నారు. వెంటనే అందరికీ రుణ మాఫీ
చేయడంతో పాటు,
రైతు భరోసా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉచిత గ్యాస్, కరెంట్
వినియోగాదారులందరికీ ఇవ్వకుండా టెక్నికల్ కారణాలతో నిరాకరిస్తున్నారని, దీనిపై స్థానికంగా
ప్రచారం చేసి ఆందోళనలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన
వాగ్దానాలను అమలు చేయగ పోగా, హైడ్రా పేరుతో, ఫార్మకంపెనీ కోసం భూసేకరణ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు
గురిచేస్తున్నరని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను దృష్టి మళ్ళీంచడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
రాజకీయ క్రీడ సడుపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ ల మధ్య మటాల యద్ధం
ప్రజల కోసం కాదని, వారి
అధికార ప్రయోజనాల కోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మోదీ ప్రభుత్వం
విద్వేషాలను రెచ్చగొట్టడమే ఒక విధానంగా పెట్టుకుందని, విద్వేష ఉన్మాద విధానలను
అనుసరిస్తుందన్నారు. మహారాష్ట్ర, హార్యాణ, జార్ఖండ్ ఉపఎన్నికలలో తన స్థాయిని మరచి
ప్రసంగిస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్
కగార్ పేరుతో దండకారణ్యంలో ఆదివాసీ ప్రజల నిర్మూలనకు పూనుకుంటుందని విమర్శించారు.
వేలది మంది సైన్యాన్ని దింపి, కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుందని, బూటకపు ఎన్ కౌంటర్లు
పెద్ద ఎత్తున చేస్తుందన్నారు. పాలస్తీనాపైస అమెరికా అందతో ఇజ్రాయిల్ చేస్తున్న
మరణహామాన్ని ఆపాలని పోటు రంగారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ
న్యాయస్థానాలు, ఐక్యరాజ్యసమితి
తీర్మానాలను ఇజ్రాయెల్ ఖతారు చేయడం లేదని అన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న నర మేధానికి
వారు కూడా కారణమాని పేర్కొన్నారు. అమెరికాలో ట్రంప్ గెలుపు ఫాసిస్టు శక్తుల గెలుపుగా
ఆయన అభివర్ణించారు. గ్రేట్ అమెరికా పేరుతో, అమెరికా సేవ్ పేరుతో నినాదాలు
ఇస్తున్న ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసం ఆర్థిక వర్ధమాన దేశాల ప్రయోజనాలకు నష్టం
కలిగిస్తున్నారని విమర్శించారు. విలేఖరుల సమావేశంలో కె.జి. రామచందర్, కె. రమ, కెచ్చెల రంగయ్య, గోళేనపల్లి
వెంకటేశ్వరరావు, చిన్నచంద్రన్న, గుమ్మడి నర్సయ్య, వి. కృష్ణ వి.
ప్రభాకర్, సదానందం, కె. సూర్యం, ఎం. కృష్ణ,అరుణ,కృష్ణారెడ్డి, తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment