రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు
రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన .ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో కలయదిరిగి పెసల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను గిట్టుబాటుకు అమ్ముకోవడంలో ఎటువంటి అసౌకర్యం కలగ కూడదన్నారు. ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు.
Comments
Post a Comment