Posts

Showing posts from June, 2026

సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి

Image
డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కమిటి సమావేశంలో రాష్ట్ర నేత ఎన్. ఎస్ రావు ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని కోరుతూ సమావేశంలో తీర్మానం  యూనియన్ ప్రెస్ క్లబ్ వ్యవహారాల ఇంచార్జీగా కె. కళ్యాణ్ చక్రవర్తి నియామకం ఖమ్మం: సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డబ్ల్యూజేఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా సమాజానికి సేవ చేసిన సీనియర్ జర్నలిస్తులు, నేడు బీపీ, షుగర్ టాబ్లెట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నాయని, అలాగే తెలంగాణలో కూడా జర్నలిస్టులకు పెన్షన్ స్కీంను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఆదివారం ఖమ్మంలో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన జిల్లాకమిటీ సమావేశానికి ఎన్. ఎస్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్ల్యూజేఐ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోందన్నారు. సంఘాన్ని ఖమ్మం జిల్లాలో మరింత బలోపేతం చేసేందుక...

సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపికి డబ్ల్యూజేఐ, టీజేఏ నేతల నివాళి

Image
ఖమ్మం: ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్, జనంసాక్షి దిన పత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ఇంఛార్జి కూరకుల గోపీకి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆప్ ఇండియా (డబ్ల్యూజేఐ), తెలంగాణ జర్నలిస్ట్స్ అసోషియేషన్ (టీజేఏ)నేతలు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం రఘునాధ పాలెం మండలంలోని గోపి స్వగ్రామం పాపట పల్లి వెళ్ళిన డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు, (ఎన్.ఎస్.రావు) ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, టీజేఏ జిల్లా అధ్యక్షులు నాగ స్వామి, డబ్ల్యూజేఐ ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు కట్టేకోల చిన నరసయ్య, మోడెపల్లి కిరణ్, గోగుల నారాయణ రావు, జాబిశెట్టి కుటుంబ రావు, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్, గోపి మిత్రుడు పసుపులేటి ఉపేందర్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. గోపి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ల నేతలు గోపీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.