సీతారామను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలి
- యాతాలకుంట టన్నెల్ పనులు శరవేగంగా చేపట్టాలి
- నిర్ణిత గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి
- భూసేకరణలో అలసత్వం వహించ వహించ వద్దు
- మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, పొంగులేటి
సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ , కాలువల పనులను
త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నీటి పారుదల
శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖా, మంత్రి మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు మేరకు జల సౌదలో సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్
రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలసి నీటి
పారుదల శాఖాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యాతాల కుంట
టన్నెల్ పనులను శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 15న ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ పంప్ హౌజ్లను ప్రారంభించామని, మిగిలిన కాలువలను, టన్నేల్ పనులను యుద్ధ ప్రాతి
పదికను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు
సంబంధించిన భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం వహించ వద్దన్నారు. అందుకు పాలనా
పరమైన అనుమతులలో జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. టెండర్ల ప్రక్రియను శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను
ఆదేశించారు. సాంకేతిక పరమైన అంశాలలో నిర్లక్ష్యం వహించ కుండా పరస్పరం సమన్వయంతో
అన్ని శాఖలు పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గడువు
లోపు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుపూర్తైతే జిల్లా రూపు రేఖలు
మారుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యా దాస్ నాధ్, ముఖ్య కార్యదర్శి
రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ.ఎన్.సి లు అనిల్ కుమార్, నాగేందర్ రావులతో పాటు సీతారామ ప్రాజెక్ట్ సి.ఇ
శ్రీనివాస రెడ్డి,ఖమ్మం జిల్లా సి.ఇ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment