బేడీలు వేసిన వాళ్ళకు రైతుల సనస్యలేం తెలుసు

హరీష్ రావు మార్కెట్ యార్డు సందర్శనపై రేణుక ఫైర్ నకిలీ విత్తన కంపెనీలను బహిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఖమ్మం ఇర్రెడియేషన్ ప్లాంట్ నిధులపై విచారణ జరపాలని డిమాండ్ త్వరలో స్థంభాద్రి , పాలేరు ఫిషర్ మెన్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు , రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీ కేంద్ర మంత్రి , రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , గంగుల కమలాకర్ ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించడంపై ఆమె మండి పడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుక మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులకు సంకెళ్ళు వేసి , జైల్లో పెడితే తాము విడిపించుకున్నామని చెప్పారు. గన్ మెన్లు లేకుండా ఎప్పుడైనా ప్రజల్లో తిరిగుంటే , ప్రజల సమస్యలు అర్ధమయ్యేవని , గుట్టలు మాయం చేస్తూ కాలం గడిపిన వాళ్ళకు రైతుల సమస్యలు తెలియదన్నారు. తాను జిల్లాకు వస్తున్నాని తెలిసి , ఏదో ఒక పనిగా మార్కెట్ యార్డును సందర్శించారని విమర్శించారు. ఉదయం 8 గంటలకే వెళ్ళి మార్కెట్ యార్డులొ కూర్చుంటే , రైతులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆ మాత్రం...