రా ... రమ్మంటున్న తెలుగు దేశం ... నామ ఏమంటారు ?
తెలంగాణలో తెలుగు దేశం పార్టీని పునరుద్దరిస్తామని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు ప్రకటించి దాదాపు మూడు నెల్లైంది. గతంలో పార్టీలో పనిచేసి, ఇప్పుడు వివిధ
పార్టీల్లో వున్న నేతలంతా తిరిగి రావాలని పిలుపు నిచ్చారు. ఈ పిలుపు తర్వాత, వివిధ పార్టీల్లో
వున్న పాత తెలుగు దేశం నేతలంతా తిరిగి ఆ పార్టీలో చేరుతారని అందరూ భావించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే ఎక్కువ చేరికలుంటాయని, ప్రధానంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ నేత నామనాగేశ్వర్ రావు పార్టీ మారే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, అనుకున్నట్లు ఆయన ఇంకా
పార్టీ మార లేదు. అయితే, నామ తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం లేదా ? అంటే, లేదని మాత్రం
ఖచ్చితంగా చెప్ప లేము. ఎందుకంటే, ఆయనకు ఇప్పటికీ టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. పార్టీ
అధిష్టానంతో, నందమూరి కుటుంబంతో పరిచయాలున్నాయి.
అందువల్ల, నామ టీడీపీలో చేరే అవకాశాన్ని కొట్టి
పారేయలేం. ఇప్పటికే ఆయనకు తెలుగు దేశం నుండి ఆహ్వానం అందినట్లు ప్రచారం
జరుగుతోంది. రెండు,
మూడు నెల్ల క్రితమే చేరికపై చర్చలు కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ
టీడీపీ అధ్యక్ష పదవిని కూడా ఆయనకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ మారడంపై నామ
వైపు నుండి ఇంత వరకూఎటువంటి సంకేతాలు రాలేదు. ఆయన దీనిపై ఇంకా ఆలోచిస్తున్నట్లు
తెలుస్తోంది. ప్రస్తుతం ఇబ్బందుల్లో వున్న బీఆర్ఎస్ ను వీడడం ఇష్టం లేకనే ఆయన ఇంకా
ఏ నిర్ణయం తీసుకో లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2019 లో కేసీఆర్ ఆయనకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు.
ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతగాఎన్నుకున్నారు. ఆ కృతజ్ఞత వల్లే, పార్టీ మారడం సమంజసం
కాదన్న బావనలో నామ వున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం రెండు, మూడు కారణాలు నామ
పార్టీ మారేందుకు దోహద పడే అవకాశముందంటున్నారు. మొదటది, ప్రస్తుతం రాష్ట్రంలో, జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి
అంత ఆశాజనకంగా లేదు. పైగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. రెండవది, టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడుతో నామకు మంచి సంబంధాలున్నాయి. అందులోనూ నామ నాగేశ్వర రావు రాజకీయ
ప్రస్థానం మొదలైంది కూడా తెలుగు దేశం పార్టీ నుండే. గతంలో ఆయన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో
సభ్యుడిగా, పార్లమెంటరీ
పార్టీ నేతగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడక ముందు, టీడీపీలో చక్రం తిప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతా తానై పార్టీని ముందుకు నడిపారు. మాడవది, ప్రస్తుతం టీడీపీ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. పొరుగు రాష్ట్రంలో అధికారంలో
వుంది. కాబట్టి, భవిష్యత్
రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని నామ పార్టీ మారే అవకాశమే ఎక్కువగా వున్నట్లు
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామ నాగేశ్వర రావు ఒక సీనియర్ నాయకుడు
కావడం, అంగ బలం అర్ధ బలం
కూడా వుండటంతో,
తిరిగి టీడీపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశ ముందంటున్నారు. కొందరు
మాత్రం, నామ పార్టీ మారక పోవొచ్చని, జరిగే ప్రచారంలో
వాస్తవం లేదని అంటున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
నామ రాజకీయ ప్రస్థానం
నామ నాగేశ్వర రావు ఒక రాజకీయ నాయకుడే కాదు. సక్సస్ పుల్ వ్యాపార వేత్త
కూడా. ప్రస్తుతం మధుకాన్ కంపెనీకి ఛైర్మైన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ
గ్రానైట్, కాంట్రాక్ట్
లు, విద్యుత్ ఉత్పత్తి
కేంద్రాలు, ఇతరత్రా
వ్యాపారాలను నిర్వహిస్తుంది. మొదటి సారి ఆయన 2004 లో తెలుగుదేశం పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయాడు.
తిరిగి అదే అభ్యర్థి పైన 2009 లో సుమారు1,25,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ పార్టీ పార్లమెంటరీ
పార్టీ నేతగా ఎన్నికయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం
నుండి 11,000 ఓట్ల తేడాతో
వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడి పోయారు. ఆయన 2018 లో జరిగిన అసెంబ్లీ
ఎన్నికల్లో కాంగ్రస్ మద్దతుతో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ
చేసి ఓటమి పాలయ్యారు. 2019 మార్చి 21న తెలంగాణ రాష్ట్ర
సమితిలో చేరారు. 2019 లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం ఎంపీగా విజయం
సాధించారు. ఈ సారి కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన
పార్లమెంట్ ఎన్నికల్లో కొంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి చేతిలో నామ ఓడి పోయారు.
Comments
Post a Comment