కొత్తగూడెం విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు

Bhadradri Kothagudem Airport

Bhadadri Kothagudem Airport

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యుద్ద ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. రానున్న నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సోమవారం హైదరబాద్ లో ప్రకటించారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పౌర విమానాయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ మేరకు లేఖ కూడా రాశారు. మరో వైపు గత సెప్టెంబర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని ఢిల్లీలో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. 

Komati Reddy Venkata Reddy


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రోపాలిటన్ నగరాల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు ఎయిర్ కనెక్టివిటీని విస్తరించడంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం విమానాశ్రయం నిర్మించడానికి కావలసిన భూమిని సేకరించడం ప్రారంభించింది. కొత్తగూడెం పట్టణానికి సమీపంలో వున్న పునుకుడు చెల్క లో 1,600 ఎకరాల భూమిని ఈ  గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాన్ని  కేటాయించారు. 2021 జనవరి 6న విమానాశ్రయ అధికారులు ప్రతిపాదిత భూమిని పరిశీలించారు. సర్కార్ విజ్ఞప్తి మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందిస్తూ టెక్నో ఎకనామిక్ ఫీజ్‌బిలిటీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. విమానాశ్రయ భూములకు సంబంధించి సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తమ నివేదికలో కోరారు. దీంతో కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియకు ఆనాడే అడుగులు పడినట్లైంది. ఇప్పుడు కాంగ్రెస్ సార్కార్ ఈ విమానాశ్రయాన్ని సాధ్యమైంత వేగంగా నిర్మించాలని చూస్తోంది. రానున్న నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, ఐటీసీ వుండడం, అశ్వాపురంలో హెవీ వాటర్ ప్లాంట్, మణుగూరు, పాల్వంచలో ధర్మల్ విధ్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కొత్తగూడెంలో సింగరేణి వుండడంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కొత్తగూడెం విమానాశ్రయం వేగంగా పూర్తయితే, ఇది హైదరాబాద్ విమానాశ్రయం తర్వాత రాష్ట్రంలో రెండవ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అవుతుంది.

Janechcha

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు