బెదిరించి డబ్బులు దండు కోవాలనుకున్న ఇద్దరి అరెస్ట్ ... ఆయుధాలు స్వాధీనం

 

Khammam Police


గ్రానైట్ వ్యాపారులను నక్సలైట్ల పేరుతో బెదిరించి, డబ్బులు వసూలు చేసేందుకు వెళుతున్న ఇద్దరిని ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నగరంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా స్థానిక కస్పాబజారుకు చెందిన మహమ్మద్ అఫ్సర్, ఖానాపురంకు చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు పోలీసులను చూసి బైక్ అక్కడే వదిలి పారి పోయారు. గమనించిన పోలీసులు వారిని వెంబడించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 3 ఫిస్టల్స్, 4 మాగ్జిన్లు, 17 బుల్లెట్లు, ఒక హీరో గ్లామర్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకున్నారు. వీరిద్దరూ గతంలో లాండ్ సెటిల్మెంట్లు చేస్తూ, నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడే వారు. వీటికి సంబంధించి మహబూబాబాద్, గార్ల, మరిపెడ, కేసముద్రం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టపోయి, అప్పుల పాలు కావడంతో అలాగైనా అప్పులు తీర్చి డబ్బులు సంపాధించాలని నిర్ణయించుకున్నారు. నక్సలైట్ల పేరుతో గతంలో బెదిరించి వసూల చేసిన అనుభవం వుండడం వల్ల ఆయుధాల కోసం 11 నెల్ల క్రితం ఎండీ రియాజ్ అనే వ్యక్తిని సంప్రదించారు. అతన్ని భీహార్ పంపించి 3 ఫిస్టల్స్, 4 మాగ్జిన్లు, 17 బుల్లెట్లు తెప్పించారు. ఆదివారం ముదిగొండ ఏరియా గ్రానైట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు వెళుతుండగా పోలీసులు ప్రకాష్ నగర్ వద్ద పట్టుకున్నారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎండీ రియాజ్ పరారీలో వున్నాడు. ఇతనిపై ఖమ్మం ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు