22 ఏళ్ళ తర్వాత ... ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
- ఫిబ్రవరిలో జరపాలని నిర్ణయం
- మహాసభల ఆహ్వాన సఘం ఏర్పాటు
భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర5వ మహాసభలు ఖమ్మంలో జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో జరుపతలపెట్టిన ఈ మహాసభలను అందరూ విజయవంతం చేయాలని చేయాలని పిలుపు నిచ్చింది. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖమ్మంలో జరగనున్న ఈ మహాసభల నిర్వహణకు ఆదివారం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం డిపిఆర్సీ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ అధ్యక్షతన ఈ ఆహ్వాన సంఘం ఏర్పాటు సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లడుతూ ఖమ్మం జిల్లా ఎప్పుడూ విద్యార్ధి ఉద్యమాలను అక్కున చేర్చుకుంటుందన్నారు. నేడు దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్లో విద్య, ఉద్యోగం అనేవి ప్రధానమైన సమస్యలన్నారు. రాష్ట్రంలో 1864 పాఠశాలలో ఒక్క టీచర్ కూడా లేక మూతపడుతున్నాయని, లక్షకు మందికి పైగా విద్యార్థులు చదువులకు దూరమయ్యారని తెలిపారు. ఈ నేపధ్యంలో యూనివర్శీటీ విద్య నుండి పాఠశాల విద్య వరకు సమస్యలపై ఈ మహాసభ చర్చిస్తుందని చెప్పారు. సమావేశంలో ప్రముఖ విద్యా వేత్తలు ఐ.వి.రమణా రావు, రవి మారుత్, కాంతా రావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటీ సరళ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం.సుబ్బారావు, యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.వి.నాగమళ్లేశ్వరావు, ప్రభుత్వ గెజిటెడ్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కొప్పిశెట్టి సురేష్, విజయ లక్ష్మి, ట్రస్మా నాయకులు నాయుడు వెంకటేశ్వర రావు మాట్లాడారు. మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ ప్రతిపాదించగా సమావేశం ఆమోదించింది.
Comments
Post a Comment