బేడీలు వేసిన వాళ్ళకు రైతుల సనస్యలేం తెలుసు

 

Renuka Choudary

  • హరీష్ రావు మార్కెట్ యార్డు సందర్శనపై రేణుక ఫైర్
  • నకిలీ విత్తన కంపెనీలను బహిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • ఖమ్మం ఇర్రెడియేషన్ ప్లాంట్ నిధులపై విచారణ జరపాలని డిమాండ్
  • త్వరలో స్థంభాద్రి, పాలేరు ఫిషర్ మెన్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి  

రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు, రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించడంపై ఆమె మండి పడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుక మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులకు సంకెళ్ళు వేసి, జైల్లో పెడితే తాము విడిపించుకున్నామని చెప్పారు. గన్ మెన్లు లేకుండా ఎప్పుడైనా ప్రజల్లో తిరిగుంటే, ప్రజల సమస్యలు అర్ధమయ్యేవని, గుట్టలు మాయం చేస్తూ కాలం గడిపిన వాళ్ళకు రైతుల సమస్యలు తెలియదన్నారు. తాను జిల్లాకు వస్తున్నాని తెలిసి, ఏదో ఒక పనిగా మార్కెట్ యార్డును సందర్శించారని విమర్శించారు. ఉదయం 8 గంటలకే వెళ్ళి మార్కెట్ యార్డులొ కూర్చుంటే, రైతులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆ మాత్రం కూడా తెలియ కుండా తిరుగుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ద్వజ మెత్తారు. ఏవైనా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అసత్య ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా రేణుక చౌదరి ప్రశంసించారు. తాను ఖమ్మం జిల్లాకు ఎప్పుడూ దూరం కాలేదని, అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను ఈ జిల్లా శ్వాశ్వత ఆడ బిడ్డనని, ఈ జిల్లా అభివృద్దికి నిరంతరం పాటు పడతానని చెప్పారు. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ సాధనలో తన పాత్ర వుందని, అందుకు ఎప్పుడో ల్యాండ్ కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పుడు అక్కడే ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందని, ఎటువంటి మార్పు వుండదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు వాడి సుజాత నగర్ మండలంలోని రైతులు నష్ట పోతే, ఒక్కొరైతుకు విత్తన కంపెనీల నుండి రూ. 6,500 ఇప్పించానని గుర్తు చేశారు. నకిలీ విత్తనాల వల్ల రాష్ట్రంలో రైతులు నష్ట పోతున్నారని, తక్షణమే ఆయా కంపెనీలను రాష్ట్రం నుండి బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధర రావాలని, ఖమ్మం జిల్లాలో ఇర్రెడియేషన్ ప్లాంట్ నిర్మాణం కోసం కేంద్రం నుండి తాను 8 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తే, ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియదన్నారు. వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈ ప్లాంట్ నిర్మాణం తన కలనీ, అవసరమైతే, కేంద్రం నుండి మరిన్ని నిధులు తెచ్చి ప్లాంట్ నిర్మిస్తామని చెప్పారు. కొత్తగూడెం రైల్యే స్టేషన్ కు వెళ్ళే రోడ్లు ఇరుకుగా వుండడం వల్ల, వాటిని విస్తరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకు అక్కడ వున్న రైల్యే భూమిని వాడుకునేందుకు ఆముమతి పొందినట్లు తెలిపారు. శీతా కాలం వెళ్ళిన తర్వాత, ఖమ్మంలో స్థంభాద్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. అలాగే పాలేరు రిజర్వాయర్ వద్ద ఫిషర్ మాన్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు. పాలేరు నుండి వివిధ రకాల చేపలు, రొయ్యలు హైదరబాద్ కు ఎగుమతి అవుతున్నాయని, అది ఈ జిల్లా గొప్ప తనమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగ అభివృద్దికి కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు, తాను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, నగర్ మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.

Janechcha

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే