మధిరలో ఏసిబి ట్రాప్
పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్రావు ఎక్స్ గ్రేషియా మంజూరుకు డబ్బులు డిమాండ్ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర పట్టణంలో అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ ) అధికారులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్రావు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందగా అతనికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్ గ్రేషియా డబ్బులు మంజూరు చేసేందుకు రూ 30 వేలు లంచం డిమాండ్ చేయగా అందులో నుండి రూ 15 వేలు తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మరణించిన కార్మికుడికి సంబంధించిన మరణ ధ్రువ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఎకౌంటు జిరాక్స్ కాపీలను లేబర్ ఆఫీస్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ లక్ష 30 వేలు ఎక్స్ గ్రేషియా గా అందజేస్తుంది. వీటిని ప్రభుత్వానికి పంపించాలంటే రూ 30 వేలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ నీ ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు కెమికల్ పౌడర్ పూసిన నోట్లను బాధితుడికి ఇచ్చి వాటిని లేబర్ ఆఫీసర్ చందర్రావు కు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల దాడిని పసిగట్టిన చందర్రావు పరారయ్యేందుకు ప్రయత్నించగ...