రాష్ట్ర స్థాయి పోటీలకు కిన్నెరసాని గిరిజన గురుకుల విద్యార్ధుల ఎంపిక
- భినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్, బేస్ బాల్ సెలక్షన్ పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. సాఫ్ట్ బాల్ అండర్–17 విభాగంలో ఇ. హర్షవర్ధన్, అండర్–14 విభాగంలో ధర్మ నాయక్, బి. రిత్విక్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అదే విధంగా బేస్ బాల్ అండర్–14 విభాగంలో ప్రవీణ్, అండర్–17 విభాగంలో జశ్వంత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు..

Comments
Post a Comment