యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

Gantela Prabhakar

ఖమ్మం యస్.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల సి.యస్.ఈ. విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు గంటెల ప్రభాకర్, ఆచార్య నాగార్జున విశ్వ విధ్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. చింతకాని మండలంలోని అనంత సాగర్ గ్రామానికి చెందిన ప్రభాకర్, “ఎన్హాన్స్డ్ మెథడాలజీస్ ఫర్ డేటా సెక్యూరిటి ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్" అనే అంశం పై డా. బొబ్బా బసవేశ్వర రావు పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. ఇందుకు గాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుండి పట్టాను పొందినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి, ప్రిన్సిపల్ డా. జి. రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభాకర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై పరిశోధన ద్వారా పొందిన అనుభవం విద్యార్థులకు, సి.యస్.ఈ విభాగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశా భావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు ప్రభాకర్ ను అభినందించారు. అభినందించిన వారిలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా. ఎ.వి.వి. శివ ప్రసాద్, డా. జె. రవీంద్రబాబు తదితరులు ఉన్నారు. ప్రభాకర్ డాక్టరేట్ పొందడం పట్ల పలువురు అనంత సాగర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే