Posts

Showing posts from October, 2025

రాష్ట్ర రెండో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలి

Image
పెండింగ్ ఐదు డి ఏ లను విడుదల చేయాలి ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి ఎస్ టి ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రంలో రెండో పిఆర్సి నివేదికను ప్రభుత్వం తీసుకుని అమలు చేయాలని, పెండింగ్ ఐదు డిఏ లను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ టి ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  బి నాగరాజు, ఈ వీరయ్య ల అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్ శివ శంకరన్ అధ్యక్షతన ద్విసభ్య కమిటీతో ఏర్పాటైన పిఆర్సి గడువు ముగిసినప్పటికీ నివేదికను స్వీకరించకపోవడం, ఫిట్మెంట్ ప్రకటించకపోవడం శోచనీయం  అన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లను తక్షణమే ప్రకటించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు అన్నిటిని క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ ట...

దేశానికి ఆదర్శంగా విద్యారంగం అభివృద్ధి

Image
పోటీ పరీక్షల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు  వచ్చే విద్యా సంవత్సరం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ రూఫ్ టాప్ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని, వారి అంచనాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికార బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల కోసం నియోజక వర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు కావలసిన పూర్తి మెటీరియల్ తో పాటు డిజిటల్ లైబ్రరీ ఈ నాలెడ్జ్ సెంటర్లలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్ లైన్ లో కోచింగ్ ఇప్పిచ్చే ఏర్పాటు ...

మధిర రామాలయ ప్రాంగణంలో పురాతన శిలాజం

Image
సుమారు 5 కోట్ల సంవత్సరాలు నాటిదని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శివనాగిరెడ్డి శిలాజాన్ని విస్తృత పరిశీలన కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన ఆలయ పునర్నిర్మాణ కమిటీ ( తాళ్లూరి అప్పారావు , మధిర ) మధిరలో అరుదైన పురాతన శిలాజం లభ్యమైంది. ఇది సుమారు 5 కోట్ల సంవత్సరాల నాటి దారుశిలాజంగా చెబుతున్నారు. పట్టణంలోని రైల్యే స్టేషన్ వద్ద గల రామాలయ ప్రాంగణంలో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శివనాగిరెడ్డి ఈ శిలను గుర్తించారు. రామాలయాన్ని పునర్నిమించాలని రైల్యే అధికార్లు , పట్టణ ప్రముఖులు ఇటీవల నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ నిర్మాణానికి తగిన సలహాలు , సూచనలు అందించేందుకు ప్రముఖ వాస్తు శిల్పి , అమరావతి బుద్ధ విహార సీఈవో ,   తెలంగాణ రాష్ట్ర నాగార్జున బుద్ధవనం ప్రాజెక్ట్ మాజీ చీప్ అడ్వైజర్ డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డిని అక్కడకు పిలిచారు. ఈ సందర్భంగా బయట పడ్డ ఓ పురాతన రాయిని ఆయన పరిశీలించారు. ఈ రాయి సుమారు 5 కోట్ల సంవత్సరాల నాటిదని గుర్తించారు. అనతరం శివ నాగిరెడ్డి మాట్లాడుతూ దీనిని దారుశిలాజంగా పిలుస్తారని చెప్పారు. అతి పురాతన...

మధిర నియోజకవర్గ మహిళలు దేశానికి ఆదర్శంగా నిలవాలి

Image
ఇందిరా మహిళా డైయిరీనా చిరకాల వాంఛ రూ 1000 కోట్లు మహిళలు సంపాదించేలా చర్యలు త్వరలో బోనకల్లులో ఇందిరా మహిళ డైయిరీ ఏర్పాటు చేస్తాం ( తాళ్లూరి అప్పారావు, మధిర ) పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గం లో ఇందిరా మహిళ  డైయిరీ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా డైయి రీ తన చిరకాల వాంఛ అని, ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో మధిర నియోజకవర్గంలోని 52,000 మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదలు కొని వ్వాలని ఆరోజు భావించానన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లపాటు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో అమలు చేయలేకపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మధిర నియోజకవర్గం లో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పాటు వారు సమాజంలో పోటీపడి బతకాలని ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో తన చిరకాల వాంఛ నెరవేరింది అన్నారు. ప్రతి మహిళకు రెండు గేదెలను ఇవ్వడంతో పాటు వాటిని కాపాడడానికి వ్యవ...

మాలదారులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం

Image
 41 రోజులు కొనసాగనున్న అన్నదానం ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర (అర్.వి. స్వామి సిండికేట్) ఆధ్వర్యంలో మాలదారులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దాతల సహాయ, సహకారాలతో అయ్యప్ప, భవాని, శివ, తిరుపతమ్మ, గోవింద మాలదారులకు స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలోని శ్రీ సాయి పసుర ఫంక్షన్ హాల్లో నేటి నుండి నుండి 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. తొలి రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాత కర్నాటి వెంకటేశ్వర రావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆర్ వి స్వామి సిండికేట్ ఆధ్వర్యంలో మాలదారులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మాలదారులు అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని సిండికేట్ గురు స్వామి రాచకొండ వెంకటేశ్వరరావు కోరారు.

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

Image
( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి శివాలయంలో కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దాములూరి సతీష్ శర్మ తెలిపారు. బ్రహ్మసూత్రం కలిగి 10 శతాబ్దాల చరిత్ర కలిగిన అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీ బుధవారం కార్తీక మాస ప్రారంభం నుండి నవంబర్ 20వ తేదీ కార్తీక మాసం ముగిసే వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి సన్నిధిలో నెల రోజుల పాటు నిర్వహించే ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన భక్తులు  గోత్ర నామార్చినకు రూ 616, అభిషేకాలకు రూ 2116, రుద్రాభిషేకానికి రూ 5116 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. అదే విధంగా నవంబర్ 5వ తేదీన పౌర్ణమి సందర్భంగా శివ కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. జగద్రక్షకుడైన రాజరాజ నరేంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. కార్తీక మాస అభిషేకాలు, పూజలలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ అర్చకులు దాములూరి సతీష్ శర్మ సెల్ నంబర్ ( 8919429238 ) లో సంప్రదించాలని ఆయన...

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే

Image
ఆంధ్ర సరిహద్దు మధిరలో మారు మోగిన నిరసన గళం. అక్రమ కేసులను ఖండిస్తూ మద్దతు పలికిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ వార్తలు రాసే మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అంటే  బావ ప్రకటన స్వేచ్ఛ పై దాడేనని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మడిపల్లి గోపాల రావు, బెజవాడ రవి బాబు, చిత్తారు నాగేశ్వర రావు, మిరియాల రమణ గుప్తా, తూమాటి నవీన్ రెడ్డి, కుంచం కృష్ణారావు, ఎన్ గోవింద్ ఆళ్ల కృష్ణ అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, నిర్బంధ విచారణను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో సాక్షి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ అట్లూరి సాంబి రెడ్డి, సాక్షి మీడియా డివిజన్ రిపోర్టర్ చేకూరి వినోద్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వివిధ చానళ్లు, పత్రిక విలేకరులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు, చానళ్లపై కేసులు పెట్టడం అంటే భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి ...

విధ్యార్ధుల సమగ్ర అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ... కలెక్టర్ జితేష్.వి పాటిల్

Image
కిన్నెరసాని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్   కలెక్టర్ కు సమస్యలు వివరించిన ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ పాఠశాల ఆవరణ అభివృద్ధి , కాంపౌండ్ వాల్ – కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు హామీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాయ్స్) లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలను కలియదిరిగిన కలెక్టర్ , పాఠశాల మైదానాన్ని పూర్తి స్థాయిలో ఆటల కోసం అభివృద్ధి చేసి , తరగతి గదులను పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే , పాఠశాల భూమి అన్యాక్రాంతం కాకుండా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్‌ కూడా శాంక్షన్ చేసి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ పాటిల్ హామీ ఇచ్చారు. అనంతరం , జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ( DSA) తరఫున విద్యార్థులకు టేబుల్ టెన్నిస్ టేబుల్ , వివిధ ఆట వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టేబుల్ టెన్నిస్ ఆడి విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ పర్యటనలో ఖమ్మం – భద్...

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

Image
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధి కోసం రూ. 60 కోట్ల కార్పస్ ఫండ్‌ విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ ఉద్యోగుల సంఘం ( TEA)   రాష్ట్ర అద్యక్షులు-- ఎస్.శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో హర్షించ దగ్గ విషమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ విడుదల చేసిన నిధుల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు రూ. 10 కోట్లు కేటాయించడం సంతోషంగా వుందన్నారు. దీంతో గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసినట్లైందని కొనియాడారు. ఈ నిధులతో పాత గురుకులాల మరమత్తు పనులు , అభివృద్ధితో పాటు ,   కొత్త గురుకులాల్లో మౌలిక సదుపాయాలు , విద్యార్థుల వసతి గృహాలు , ల్యాబ్‌లు , లైబ్రరీలు , త్రాగునీటి సౌకర్యం , పరిశుభ్రత , స్మార్ట్ క్లాస్‌ రూంల వంటి అనేక సదుపాయాలు కల్పించ వచ్చన్నారు. ఫలితంగా గిరిజన విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన , నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యపై చూపుతున్న శ్రద్ధ , దూరదృష్టి , కృషి నిజంగా అభినందనీయమని , ఈ నిర్ణయం గిరిజన విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ...