రాష్ట్ర రెండో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలి

Chava Ravi

  • పెండింగ్ ఐదు డి ఏ లను విడుదల చేయాలి
  • ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
  • ఎస్ టి ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి
( తాళ్లూరి అప్పారావు, మధిర )

తెలంగాణ రాష్ట్రంలో రెండో పిఆర్సి నివేదికను ప్రభుత్వం తీసుకుని అమలు చేయాలని, పెండింగ్ ఐదు డిఏ లను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ టి ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  బి నాగరాజు, ఈ వీరయ్య ల అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్ శివ శంకరన్ అధ్యక్షతన ద్విసభ్య కమిటీతో ఏర్పాటైన పిఆర్సి గడువు ముగిసినప్పటికీ నివేదికను స్వీకరించకపోవడం, ఫిట్మెంట్ ప్రకటించకపోవడం శోచనీయం  అన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లను తక్షణమే ప్రకటించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు అన్నిటిని క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మధిర వచ్చిన సందర్భంగా పలువురు ఉపాధ్యా యులు బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఏ వినోద్ రావు, మధిర మండల ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కాజ సునిత, కోశాధికారి బి చెన్నయ్య, పూర్వ జిల్లా కార్యదర్శి రావిరాల లక్ష్మణరావు, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీహరి, మహ్మద్ రఫీ,  మండల కార్యదర్శులు లంకా నాగేశ్వరరావు, షేక్ లాల్ అహ్మద్, వి. కొండలరావు, కె.రమేష్, ఎన్.గోపిచంద్, నాయకులు  శ్రీనివాసరెడ్డి, బి.రమేష్, డి మహేంద్ర కుమార్, వేల్పుల సాంబయ్య, వై చిన్ని, స్వర్గం శ్రీనివాసరావు,SVస్వామి,ఎం.విజయ్ కుమార్, బొందిల చైతన్య,  లక్ష్మణ్, అన్సారి, రామకృష్ణ  మరియూ పలువురు  ఉపాధ్యాయులు, టాప్రా నాయకులు మీరా ఖాన్, తలుపుల సాంబయ్య, సిహెచ్ వెంకట్రావు లు పాల్గొన్నారు.

Chava Ravi

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే