మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే

Madhira Press
  • ఆంధ్ర సరిహద్దు మధిరలో మారు మోగిన నిరసన గళం.
  • అక్రమ కేసులను ఖండిస్తూ మద్దతు పలికిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు

( తాళ్లూరి అప్పారావు, మధిర )

ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ వార్తలు రాసే మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అంటే  బావ ప్రకటన స్వేచ్ఛ పై దాడేనని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మడిపల్లి గోపాల రావు, బెజవాడ రవి బాబు, చిత్తారు నాగేశ్వర రావు, మిరియాల రమణ గుప్తా, తూమాటి నవీన్ రెడ్డి, కుంచం కృష్ణారావు, ఎన్ గోవింద్ ఆళ్ల కృష్ణ అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, నిర్బంధ విచారణను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో సాక్షి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ అట్లూరి సాంబి రెడ్డి, సాక్షి మీడియా డివిజన్ రిపోర్టర్ చేకూరి వినోద్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వివిధ చానళ్లు, పత్రిక విలేకరులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు, చానళ్లపై కేసులు పెట్టడం అంటే భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడమే మీడియా బాధ్యతని, అటువంటి మీడియాపై తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ప్రభుత్వాలు కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని వెలికి తీయడమే మీడియా పనని, అటువంటి మీడియాపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధ విచారణను చేపట్టడం ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా మీడియాపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి దాడులు జరగకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల దేనన్నారు. మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి, కోశాధికారి పల్లపోతు ప్రసాద రావు, గౌరవ అధ్యక్షులు, మక్కెన నాగేశ్వరరావు, గౌరవ సలహాదారు దనిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మీడియాను అణగ దొక్కాలని చూస్తే అంతే స్థాయిలో బలంగా లేచి నిలబడుతుందని హెచ్చరించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న మధిర నియోజకవర్గ కేంద్రంలో సాక్షి పై పెట్టిన కేసులను నిరసిస్తూ చేసిన ఈ ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ భాను ప్రకాష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మందా సైదులు, పడకంటి మురళి, బిజెపి నాయకులు శిలివేరు సాంబశివ రావు, పాపట్ల రమేష్, శివరాజు సుమంత్, బి ఆర్ ఎస్ నాయకులు అరిగె శ్రీనివాసరావు, వై వి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు మునుగోటి వెంకటేశ్వర రావు, తలుపుల వెంకటేశ్వర్లు, సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహా రెడ్డి, తల్లపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాధవరపు నాగేశ్వర రావు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహా రావు ఎమ్మార్పీఎస్ నాయకులు కనకపుడి శ్రీను మేకల రాజా కూరపాటి సురేష్, వివిధ పత్రికల, ఛానళ్ళ సీనియర్ జర్నలిస్టులు మిరియాల శ్రీనివాస రావు, శ్రీరామోజు యోగేష్, రావిరాల శశి కుమార్, తాళ్లూరి అప్పారావు, పసుపులేటి శ్రీనివాస రావు, చల్లా శ్రీనివాస రెడ్డి, గణేష్, దుబాసి రాజేష్, కోట రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Madhira Press

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు