మాలదారులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం
- 41 రోజులు కొనసాగనున్న అన్నదానం
( తాళ్లూరి అప్పారావు, మధిర )
మధిర పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర (అర్.వి. స్వామి సిండికేట్) ఆధ్వర్యంలో మాలదారులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దాతల సహాయ, సహకారాలతో అయ్యప్ప, భవాని, శివ, తిరుపతమ్మ, గోవింద మాలదారులకు స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలోని శ్రీ సాయి పసుర ఫంక్షన్ హాల్లో నేటి నుండి నుండి 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. తొలి రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాత కర్నాటి వెంకటేశ్వర రావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆర్ వి స్వామి సిండికేట్ ఆధ్వర్యంలో మాలదారులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మాలదారులు అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని సిండికేట్ గురు స్వామి రాచకొండ వెంకటేశ్వరరావు కోరారు.


Comments
Post a Comment