మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి శివాలయం

( తాళ్లూరి అప్పారావు, మధిర )

మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి శివాలయంలో కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దాములూరి సతీష్ శర్మ తెలిపారు. బ్రహ్మసూత్రం కలిగి 10 శతాబ్దాల చరిత్ర కలిగిన అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీ బుధవారం కార్తీక మాస ప్రారంభం నుండి నవంబర్ 20వ తేదీ కార్తీక మాసం ముగిసే వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి సన్నిధిలో నెల రోజుల పాటు నిర్వహించే ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన భక్తులు  గోత్ర నామార్చినకు రూ 616, అభిషేకాలకు రూ 2116, రుద్రాభిషేకానికి రూ 5116 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. అదే విధంగా నవంబర్ 5వ తేదీన పౌర్ణమి సందర్భంగా శివ కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. జగద్రక్షకుడైన రాజరాజ నరేంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. కార్తీక మాస అభిషేకాలు, పూజలలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ అర్చకులు దాములూరి సతీష్ శర్మ సెల్ నంబర్ ( 8919429238 ) లో సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి శివాలయం

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే