విధ్యార్ధుల సమగ్ర అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ... కలెక్టర్ జితేష్.వి పాటిల్

Collector Jithesh V patil

  • కిన్నెరసాని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్  
  • కలెక్టర్ కు సమస్యలు వివరించిన ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్
  • పాఠశాల ఆవరణ అభివృద్ధి, కాంపౌండ్ వాల్ కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు హామీ


Jithesh V Patil

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాయ్స్) లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలను కలియదిరిగిన కలెక్టర్, పాఠశాల మైదానాన్ని పూర్తి స్థాయిలో ఆటల కోసం అభివృద్ధి చేసి, తరగతి గదులను పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే, పాఠశాల భూమి అన్యాక్రాంతం కాకుండా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్‌ కూడా శాంక్షన్ చేసి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ పాటిల్ హామీ ఇచ్చారు. అనంతరం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) తరఫున విద్యార్థులకు టేబుల్ టెన్నిస్ టేబుల్, వివిధ ఆట వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టేబుల్ టెన్నిస్ ఆడి విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ పర్యటనలో ఖమ్మం భద్రాద్రి రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


Jithesh V Patil

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే