సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రామారావును పరామర్శించిన డబ్ల్యూజేఐ నేతలు

WJI

  • తండ్రి నాగయ్య చిత్ర పటం వద్ద పూలు వుంచి ఘన నివాళి

ఖమ్మం: సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రామారావును వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ఇండియా(డబ్ల్యూజేఐ) ప్రతినిధులు పరామర్శించారు. రామారావు నాన్న వడ్డే నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా సోమవారం ఖమ్మం రమణ గుట్ట ప్రాంతంలోని రామారావు నివాసానికి వెళ్ళిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు), ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, జిల్లా కో కన్వీనర్ యెన్న బోయిన శ్రీనివాస రావు, జిల్లా నాయకులు పోటు శ్రీనివాస్, కట్టేకోల చిన సరసయ్య, జాబిశెట్టి కుటుంబ రావు, నాయకులు చామర్తి శ్రీనివాస చారి, వుల్లోజి హరీష్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ బద్రు నాయక్ తదితరులు వడ్డే నాగయ్య చిత్ర పటం వద్ద పూలు వుంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం నాగయ్య మృతికి గల కారణాలను ఆయన కుమారుడు, సీనియర్ జర్నలిస్ట్ రామారావును అడిగి తెలుసుకున్నారు. 


Comments

Popular Posts

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి