Posts

Showing posts from September, 2026

సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రామారావును పరామర్శించిన డబ్ల్యూజేఐ నేతలు

Image
తండ్రి నాగయ్య చిత్ర పటం వద్ద పూలు వుంచి ఘన నివాళి ఖమ్మం: సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రామారావును వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ఇండియా(డబ్ల్యూజేఐ) ప్రతినిధులు పరామర్శించారు. రామారావు నాన్న వడ్డే నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా సోమవారం ఖమ్మం రమణ గుట్ట ప్రాంతంలోని రామారావు నివాసానికి వెళ్ళిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) , ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ , జిల్లా కో కన్వీనర్ యెన్న బోయిన శ్రీనివాస రావు , జిల్లా నాయకులు పోటు శ్రీనివాస్ , కట్టేకోల చిన సరసయ్య , జాబిశెట్టి కుటుంబ రావు , నాయకులు చామర్తి శ్రీనివాస చారి , వుల్లోజి హరీష్ , లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ బద్రు నాయక్ తదితరులు వడ్డే నాగయ్య చిత్ర పటం వద్ద పూలు వుంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం నాగయ్య మృతికి గల కారణాలను ఆయన కుమారుడు , సీనియర్ జర్నలిస్ట్ రామారావును అడిగి తెలుసుకున్నారు. 

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి

Image
         ఎల్.ఐ.జి , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలి          అధికారులు విచారణ పూర్తి చేసి , వెంటనే ఖమ్మం ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు జరపాలి           ఈ మేరకు ఖమ్మం జిల్లా డబ్ల్యూజేఐ సమావేశంలో తీర్మానాల ఆమోదం          ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటం తప్పదని స్పష్టం చేసిన రాష్ట్ర నేత ఎన్.ఎస్. రావు          డబ్ల్యూజేఐ సభ్యులకు జాతీయ డిజిటల్ మెంబర్షిప్ కార్డుల అందజేత      ఖమ్మం: దశాబ్దాలకు పైగా గంపెడాశతో ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు , తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టులకు ఎల్.ఐ.జి , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఖమ్మం ప్రెస్ క్లబ్ పై జరగుతున్న విచారణను తక్షణమే పూర్...