మధిర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ
ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ విద్య టూరిజం హబ్ గా మధిర నియోజకవర్గం జీ+2 పద్ధతిలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ఘనమైన చరిత్ర కలిగిన మధిర పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో వేగవంతంగా పనులు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మధిర పట్టణంలో రూ 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మధిర మున్సిపాలిటి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అల్లాడుతున్న సమయంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న బొంబాయిలో 86 మంది సభ్యులతో ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మధిర పట్టణ ప్రజలకు పౌర సేవలు అందించే మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు భూమిపూజ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకు స్థానిక మున్సి...