అధునాతన వస్త్రా ప్రపంచానికి కాసం పెట్టింది పేరు

Anchor Anasuya
  • అధునాతన వస్త్రా ప్రపంచానికి కాసం పెట్టింది పేరు
  • మధిర లో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
  • మధిరలో అతి పెద్ద వస్త్ర దుకాణం
  • ఆట పాటలతో సందడి చేసిన సినీ నటి, యాంకర్ అనసూర్య భరద్వాజ్
( తాళ్లూరి అప్పారావు, మధిర )

అదునాతన వస్త్రాలు, జెంట్స్, లేడీస్, కిడ్స్ వేర్, నిత్య నూతన వెరైటీలకు, నూతన కలెక్షన్స్ కు కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందని ప్రముఖ సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. మధిర పట్టణంలోని వైరా రోడ్ లో కాసం ఫ్యాషన్స్ 23వ వస్త్ర దుకాణాన్ని ఆదివారం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధిర లో కాసం ఫ్యాషన్స్ దుకాణాన్ని ప్రారంభించడం ఆనందంగ ఉందన్నారు.మధిర ప్రాంత ప్రజలు ఖమ్మం, విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కాసం ఫ్యాషన్స్ లో అన్ని రకాల అధునాతనమైన వస్త్రాలు అందుబాటు ధరల్లో దొరుకుతాయన్నారు. కాసం ఫ్యాషన్స్ లోని వస్త్ర వెరైటీలను పరిశీలిస్తూ అభిమానులతో కలిసి సందడి చేశారు. కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత  5 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 23 కాసం ఫ్యాషన్స్ వస్త్ర దుకాణాలను ప్రారంభించడం జరిగిందన్నారు. తమ వస్త్ర దుకాణాలలో లభించే వస్త్రాలను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

అధునాతన ఫ్యాషన్ డిజైన్లను, నాణ్యమైన వస్త్రాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తున్నామని తెలిపారు. తమ సంస్థ ద్వారా మధిర లో స్థానికులకు,  ప్రభుత్వ ఉద్యోగ అవకాశం లేని  150 మందికి ఉపాధి కల్పిస్తున్నమన్నారు.  సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా నమ్మకం లేదని తమ వద్ద సామాన్య వ్యక్తులకు కూడా ఉపాధి గ్యారంటీ అన్నారు.  తొలుత  సినీనటి అనసూర్య భరద్వాజ్ ను చూసేందుకు ఉదయం నుండి అభిమానులు, పరిసర ప్రాంత యువతి, యువకులు బారులు తీరారు. యువతి యువకుల కేరింతలతో కాసం షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది.   కార్యక్రమం లో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్,  కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్ తో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Kasam, Madhira

 


Comments

Popular Posts

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు

ఈ నెల 28న కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు