ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం
( తాళ్లూరి అప్పారావు, మధిర )
స్థానిక లడక్ బజార్ అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామికి బుధవారం స్థానిక వైరా నదిలో భక్తుల కోలాహలం మధ్య ఆరట్టు ఉత్సవం( నదీ స్నానం ) ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు స్వామివారి నదీ స్నానంతో ముగిశాయి. స్వామివారి ఆలయం వద్ద నుండి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వైరా నది వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి నదీ స్నానాన్ని ఆచరింపజేశారు. స్వామి వారితో పాటు మాలదారులు భక్తులు నది స్నానం ఆచరించారు. మంగళవారం భారీ ఎత్తున జరిగిన పల్లివేట గ్రామోత్సవం అనంతరం ఆలయ మంటపంలో ఉంచిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అయ్యప్ప మాలదారులు భక్తులు నదీ స్నానానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
నది వద్ద స్వామివారికి పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహించి మహిళలకు పసుపు, కుంకుమలను అందజేశారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్నదానాన్ని పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి వెంకట రవికుమార్ ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల ముగింపు రోజున ఉదయం పూట శివేలీ ప్రదక్షణ, రాత్రి పడి భజన కార్యక్రమాన్ని తాళ్లూరి అప్పారావు దంపతులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువాది ధర్మారావు, చలువాది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురు స్వాములు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్, పాసికంటి గాంధీ, కుంద పుల్లారావు, మాలదారులు, భక్తులు పాల్గొన్నారు.




Comments
Post a Comment