రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి
- పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపీచంద్ , కళ్యాణం
( తాళ్లూరి అప్పారావు, మధిర )
మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్. గోపీచంద్ కళ్యాణం నాగేశ్వరావు డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక క్లబ్ కాంప్లెక్స్ ఆవరణలో టి సాంబయ్య అధ్యక్షతన ఆ సంఘం ఏడవ మహాసభలను నిర్వహించారు. మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పెన్షనర్లు వారి సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న జిపిఎఫ్, టీఎస్ జిఎల్ఐ, ఈ ఎల్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ వెంటనే చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యం అందించాలని , వేతన సవరణ నివేదిక ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే చెల్లించాలన్నారు. 398 రూపాయల వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ 9000 చెల్లించాలని, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ 15000 పెన్షన్ చెల్లించాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
నూతనంగా సర్పంచ్ కి ఘన సన్మానం
గత మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయునిగా పనిచేసే పదవి విరమణ పొంది ప్రస్తుతం టి ఏ పి ఆర్ పి ఏ సభ్యునిగా కొనసాగుతూ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహాదేవపురం సర్పంచిగా ఎన్నికైన వాసిరెడ్డి నాగేశ్వరావు ను ఈ మహాసభ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ మహాసభలో మధిర డివిజన్ ప్రధాన కార్యదర్శి మీరా ఖాన్, గౌరవాధ్యక్షులు తాళ్లూరి ఆంజనేయులు, డివిజన్ నాయకులు ఆర్ లక్ష్మణ్ రావు , పి వెంకట్రావు, బి సుబ్బరాజు, ఎం ఆశీర్వాదం, బి శేషగిరిరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , డి భాస్కరరావు, కే కృష్ణారావు, కే బాబురావు, వై పున్నారెడ్డి, సిహెచ్ వెంకట్రావు, పి సాంబశివరావు, డి కృష్ణయ్య, ఎండి సలీం, బి రాజారావు, ఎం కస్తూరిబాయ్ , పి కృష్ణరాణి, వై జ్యోతి, సాజీరా బేగం,వి సీతారామమ్మ , వి స్వతంత్ర, సిహెచ్ అరుణ్ కుమారి, ఈ దేవమణి, జి బాబురావు , వెస్లీ, అర్లప్ప ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment