బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు
- ఈ నెల 31 వరకు ఆపరేషన్ మస్కాన్ స్పెషల్ డ్రైవ్
- పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు ప్రతి పోలీస్
సబ్ డివిజన్ పరిధిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ఒక ఎస్సైతో
పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆపరేషన్ ముస్కాన్ 11వ విడుత కార్యక్రమంలో భాగంగా ఏ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు
బాల కార్మికులను గుర్తించేందుకు, ఇతర శాఖల అధికార్లతో కలిసి ఈ నెల1 నుండి 31వరకు జిల్లాలో
దాడులు నిర్వహిస్తాయి. దీనికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెంలోని
తన కార్యాలయంలో మంగళ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జనవరిలో
జరిగిన ఆపరేషన్ స్మైల్లో 40 మంది బాల కార్మికులను గుర్తించి రాష్ట్రంలోనే జిల్లా
ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే, వెంటనే 1098 లేదా
డయల్100 లేదా స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు.
బిక్షాటన, వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు ... నోడల్ అధికారి రెహమాన్
అనంతరం ఆపరేషన్ ముస్కాన్- జిల్లా నోడల్ అధికారి, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో
ముస్కాన్ -సబ్ డివిజన్ బృందాల సమావేశం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు చైల్డ్
వెల్ఫేర్, లేబర్
డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్
డిపార్ట్మెంట్, చైల్డ్
ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో పలు హాట్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని ఈ
సందర్బంగా డీఎస్పీ రెహమాన్ ముస్కాన్ అధికారులకు సూచించారు. గతంలో ఆపరేషన్ ముస్కాన్
ద్వారా రెస్క్యూ చేసిన పిల్లల యొక్క ప్రస్తుతం పరిస్థితిని కూడా తెలుసుకోవాలన్నారు.
బడికి వెళ్లకుండా చదువు మానేసి, పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని మళ్ళీ స్కూల్లో
చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా
బలవంతంగా బిక్షాటన, వెట్టి
చాకిరీ చేయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వెల్ఫేర్ అధికారి స్వర్ణలత లెనీనా, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీపీఓ హరి కుమారి, అసిస్టెంట్ లేబర్
ఆఫీసర్ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
Comments
Post a Comment