జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్, సెస్సులు తొలగించండి

WJI

  • వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా నేతల డిమాండ్
  • టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేత

ఖమ్మం: వర్కింగ్ జర్నలిస్టుల స్టేట్ కన్సెషన్ పాసులపై టీజీఎస్ ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్న టోల్ టాక్స్, సెస్సులను వెంటనే తొలగించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) డిమాండ్ చేసింది. నిబంధనల మేరకు బేసిక్ చార్జీల్లో 1/3 (సుమారు 33.3%) మాత్రమే వసూలు చేయాల్సి వుండగా, టోల్ టాక్స్, సెస్సులు కలిపి 50 నుండి 60 శాతం వరకూ ఛార్జీలు వసూలు చేయడం సరైంది కాదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కోకన్వీనర్లు యెన్నెబోయిన శ్రీనివాస రావు, నాగరాజు దేవర, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్, ప్రెస్ క్లబ్ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబ రావు, గోగుల నారాయణ రావు, కె. ప్రసాద రావు, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్, సీనియర్ జర్నలిస్ట్ ఆరిక కిరణ్ కుమార్ తదితరులు తెలంగాణ ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ ఏ. సరి రామ్ కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల స్టేట్ కన్సెషన్ పాసులపై అదనంగా విధిస్తున్న టోల్ టాక్స్, సెస్సుల వల్ల జర్నలిస్టులు ఆర్థిక భారానికి గురవుతున్నారని యూనియన్ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆర్.ఎం దృష్టికి తెచ్చారు. విధుల్లో భాగంగా నిత్యం ప్రయాణాలు చేయాల్సిన జర్నలిస్టులకు ఈ రకమైన అదనపు వసూళ్లు మానసిక, ఆర్థిక ఆందోళనను కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ అదనపు భారాన్ని ఏ రూపంలో వసూలు చేసినా, తక్షణమే రద్ధు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంబమైన మీడియా రంగానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, రవాణా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ రవాణా చార్జీల్లలో రాయితీలను ఇస్తోందని గుర్తు చేశారు. ఆయితే, ఇప్పుడు స్టేట్ కన్సెషన్ పాసులపై ఆర్టీసీ అదనంగా వసూల చేస్తున్న టోల్ టాక్స్, సెస్సుల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోందని పేర్కొన్నారు.వెంటనే కార్పొరేషన్ ఈ రకమైన అదనపు వసూళ్లకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూజేఐ ప్రతినిధుల విజ్ఞప్తిపై స్పందించిన రీజనల్ మేనేజర్ ఏ. సరి రామ్, ఈ సమస్యను ప్రభుత్వం, కార్పొరేషన్ పెద్దల దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఇది రీజనల్ స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్య కాదని, రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందన్నారు. డబ్ల్యూజేఐ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. అనంతరం, ఖమ్మం నుండి కోదాడ, కోదాడ నుండి ఖమ్మానికి  రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ఆర్డినరీ బస్సును నడపాలని డబ్ల్యూజేఐ ప్రతినిధులు ఆర్.ఎంను కోరారు. ఆ సమయంలో ఆర్డినరీ సర్వీస్ లేక పోవడం వల్ల, ఆ రహదారిలోని వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన జర్నలిస్టులతో పాటు, ప్రయాణీకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై కూడా సానుకూలంగా స్పందించిన రీజనల్ మేనేజర్ ఏ. సరి రామ్ తగిన చర్యలు తీసుకుంటామని డబ్ల్యూజేఐ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

WJI



Comments

Popular Posts

జాప్యం లేకుండా అక్రిడేషన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయండి

సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి

సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపికి డబ్ల్యూజేఐ, టీజేఏ నేతల నివాళి