Posts

Showing posts from October, 2026

చారిత్రాత్మక ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

Image
నవంబర్ 15 - 18 తీదీల్లో జాతీయ మహాసభలకు విస్తృత ఏర్పాట్లు   ​37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత  చారిత్రాత్మక రైతు సభలు  ​15న 15 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు లక్ష మందితో భారీ బహిరంగ సభ! ​90 ఏళ్ల వీరోచిత పోరాటాల వారసత్వంతో ఐక్య పోరాటాలు  సాయుధ పోరాట  స్ఫూర్తితో రైతు సభలు  ​మోదీ రైతు వ్యతిరేక విధానాలపై సమరభేరి  సభల్లో రైతు సంక్షేమానికి ఉద్యమ కార్యాచరణ! ​కార్పొరేట్ కొమ్ముకాసే కేంద్ర ఒప్పందాలు రద్దు చేయాలి  పంటలకు చట్టబద్ధ మద్దతు ధరల చట్టం తేవాలి  ​పేద రైతులకు నెలకు 10,000 పెన్షన్ డిమాండ్ కార్పొరేట్ శక్తులకు విద్యుత్ ధారాదత్తం  మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్   ఖమ్మం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను అత్యంత ఉద్యమ స్ఫూర్తి తో నిర్వహించబోతున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. నవంబర్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ చారిత్రాత్మక మహాసభల వివరాలను ఆయన బుధవారం ...

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శుభారంభం

Image
వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ   శ్రీ శ్రీ శ్రీ త్రిదండి  చిన్నజీయర్ స్వామి , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా పవిత్ర క్రతువు ఖమ్మం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఖమ్మంలో కొలువుదీరేందుకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు , మంగళవాయిద్యాల నడుమ  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వేద మంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు , ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భూమి పూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ జరిగింది. ఈ పవిత్ర ఘట్టం అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శ...